38.7 C
Hyderabad
May 7, 2024 18: 51 PM
Slider కర్నూలు

మ‌హానంది పుణ్యక్షేత్రం రుద్ర తీర్థంలో అద్భుతం

#mahanandi

కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలోని రుద్ర తీర్థంలో ఈరోజు అద్భుతం జరిగింది. ఇక్కడి కోనేటి జలం గురించి అనేక పురాణ కథనాల ఆధారాలు ఉన్నాయి. ఈ జలం మహా నందీశ్వర స్వామిని స్పర్శించి స్వామి క్రింది నుంచి వస్తుందనేది సత్యం. ఈ రోజు ఉదయం శివాలయంలో విధుల్లో ఉన్న అర్చకులు బాబు స్వామి ప్రతి రోజూ లాగ తెల్లవారు ఝామున అభిషేకానికి జలం తీసుకుంటూ ఉండగా రాళ్ళ మధ్యలో వేగంగా వస్తున్న జల ప్రవాహమును గమనించి కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ కి తెలిపారు. భక్తులకు ఈ అద్భుతమైన జల విశేషాన్ని తెలిపేందుకు వీలుగా ఈరోజు పైపును ఉంచి చూడగా అందులో నుంచి అత్యంత వేగంగా వస్తున్న జల ప్రవాహం ప్రత్యక్షంగా కనిపించిన ఈ దృశ్యం అబ్బుర పరిచింది. ఇక్కడి నంది నోట్లో నుండి జలం ఎలా వస్తుందో చూస్తే మన పురాణాలలో చెప్పిన అంశాలు పరమ సత్యాలనే విషయం అర్థమవుతుంది. ఈ అద్భుత జల ప్రవాహం కలిగిన కోనేరు భారతావనిలో ఎక్కడ లేదనేది నగ్న సత్యం.

Related posts

ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులతో సహా మరో మహిళ మృతి

Satyam NEWS

కేమల్ కిల్లింగ్ :హెలీకాఫ్టర్లో తిరుగుతూవేటాడుతూ చంపుతున్నారు

Satyam NEWS

జై తెలంగాణ: అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి

Satyam NEWS

Leave a Comment