42.2 C
Hyderabad
May 3, 2024 16: 55 PM
Slider జాతీయం

వివాహ వ‌య‌సు పెంచితే.. కొంద‌రికి బాధ

మ‌హిళ‌ల వివాహ వయస్సును 21కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలు సంతోషంగా ఉన్నారని, అయితే ఇది కొందరికి బాధ కలిగించిందని ప్రధాని మోడీ అన్నారు. దేశం తన కుమార్తెల కోసం ఈ నిర్ణయం తీసుకుంటోంది. దీని వల్ల ఎవరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అందరూ చూస్తున్నారు అని అన్నారు.

తాజాగా బీజేపీ ప్ర‌భుత్వం రెండు ప్ర‌ధాన‌మైన బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టారు. ‘ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం’ చేసే ఎన్నికల చట్టం సవరణ బిల్లు, ‘అమ్మాయిల పెళ్లి వయసు పెంపు’ బిల్లులపై విప‌క్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి.

అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు తేదీ ఈనెల 23 అయినా, ప్రస్తుతం రెండు సభల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా సభ ఏ క్షణంలోనైనా నిరవధిక వాయిదా పడే అవకాశాలుండటంతో మోదీ సర్కార్ స్పీడు పెంచింది. ఈ శీతాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లుల్ని ఆమోదింపజేసుకొని, మరునాడే రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అమ్మాయిల పెళ్లి వయసును 21ఏళ్లకు పెంచడాన్ని తప్పుపడుతూ విపక్ష ఎంపీలు నిరసనలు చేస్తుండగా, ఆ గందరగోళంలోనే ప్ర‌భుత్వం బిల్లును ప్రవేశపెట్టింది.

Related posts

షూటింగ్ ఛాంపియన్ ఈశాసింగ్ కు అభినందన

Satyam NEWS

సిఎం జగన్ ను ఇరికించేందుకేనా ఈ ఎత్తుగడ

Satyam NEWS

జగన్ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు

Satyam NEWS

Leave a Comment