33.7 C
Hyderabad
April 29, 2024 00: 25 AM
Slider మహబూబ్ నగర్

క్రిస్మస్ ను కరోనా నిబంధనలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలి

#wanaparthy

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నదని, క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను కరోనా నిబంధనలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.

బుధవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం, గాంధీనగర్ లోని “కల్వెరి టౌన్ చర్చ్” ను జిల్లా కలెక్టర్ సందర్శించి, జడ్పీ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డితో కలిసి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క క్రిస్టియన్ క్రిస్మస్ పండగను సంతోషగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ గిఫ్టు ప్యాక్ లు, బట్టలు పంపిణీ చేస్తున్నదని, కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను కుటుంబ  సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వివరించారు. 

క్రిస్మస్ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచమంతా శాంతియుతంగా, ప్రేమ పూర్వకంగా ఉండాలని, ప్రేమను అందరికి పంచాలని, త్యాగం, ప్రేమ గొప్పతనాన్ని మనకు తెలిపిన “యేసు ప్రభువు” బోధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, మన ముందు తరాల వారికి ప్రేమ, త్యాగం గొప్పతనాన్ని, విలువలను తెలిసేవిధంగా చూడాలని, పండగలను అందరూ కలిసి వేడుకగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకుంటూ భౌతికదూరం పాటిస్తూ పండుగ జరుపుకోవాలని ఆమె సూచించారు. క్రిస్టమస్ పండుగ రోజున అధిక సంఖ్యలో ప్రజలు చర్చికి వస్తారని, అందుచే కరోనా నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. 

క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు పండగను సంతోషంగా జరుపుకోవాలని, నిరుపేదలకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ లు, బట్టలు పంపిణి చేస్తున్నదని ఆమె అన్నారు. ప్రతి పేదవారు సంతోషంగా క్రిస్మస్ పండగ జరుపుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం  హిందువులకు బతుకమ్మ పండగకు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు, రంజాన్ సందర్భంగా ముస్లింలకు బట్టల పంపిణి, క్రిస్మస్ సందర్భంగా పేద క్రైస్తవులకు  గిఫ్ట్ ప్యాక్ ల పంపిణి వంటి కార్యక్రమాలు చేపట్టి పండగలు ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకొనుటకు కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ వివరించారు. క్రైస్తవులందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, జిల్లా కలెక్టర్ క్రిస్మస్ శుభాక్షాంక్షలు తెలిపారు. 

జడ్పీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ చదువుల కొరకు ప్రభుత్వం కే.జీ. నుండి పి.జి. వరకు అన్ని వసతులు కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, ప్రేమ, జాలి, కరుణ, దయ, త్యాగం, శ్రమించే తత్వం, ప్రేమ పూర్వకంగా  ఉండే అలవాట్లు పెంచుకోవాలని, మంచి వ్యక్తులుగా మెలగాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా మైనార్టీ అధికారి అనిల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తహ సిల్దార్ రాజేందర్ గౌడ్, పాస్టర్లు కృష్ణ పాల్, ప్రకాష్, ప్రోగ్రామ్ అధికారి గంధం ప్రసాద్, పి డి. జయ ఆనందం, పి డి సుకన్య, గంధం పరంజ్యోతి, డీ యాకుబ్, కృప కుమార్, పాస్టర్ జాన్ అబ్రహం,విద్యాసాగర్, కౌన్సిలర్ సత్యమ్మా   గంధం ప్రసాద్, జయానందం, ప్రేమ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం వనపర్తి పట్టణం నర్సింగాయ పల్లిలోని మాతా, శిశు సంరక్షణ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించి, నిర్మాణ పనులలో ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆమె తెలిపారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రం పనులలో జాప్యం లేకుండా చెయ్యాలని కాంట్రాక్టర్లను ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

ఘనంగా మణిపూర్ మహరాణీ గైడిన్లుయా 108వ జయంతి

Bhavani

కొత్త వేరియంట్లు తప్పవు

Sub Editor 2

“నట”వ్యవసాయానికి నడుం కట్టిన పుడమి పుత్రుడు

Satyam NEWS

Leave a Comment