నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న సింగరాజుపల్లి, గొట్టిముక్కుల రిజర్వాయర్లకు నిధులు మంజూరు చేయాలని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆయన ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరాజుపల్లి, గొట్టిముక్కుల రిజర్వాయర్లు పూర్తి అయితే 41 వేల ఎకరాలు సస్యశ్యామలంగా మారనున్నాయని తెలిపారు.
సింగరాజుపల్లి రిజర్వాయర్ 0.81 నీటి నిల్వ సామర్థ్యం 70ఎకరాలకు భూసేకరణకు గాను రూ.3.5కోట్లు నిధులు మంజూరు, గొట్టిముక్కుల రిజర్వాయర్ 1.8నీటి నిల్వ సామర్ధ్యం 350 ఎకరాలకు భూసేకరణకు గాను రూ.350కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కోరారు.
ఆర్ అండ్ ఆర్ నిర్వాసితుల క్రింద పుతాల్ రాం తండాకు 41ఇండ్లు, లింగన్నబావికి ఇండ్లు మొత్తం 65 ఇండ్లకు గాను రూ.16కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేసుకున్న ఈ రెండు రిజర్వాయర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన కోరారు.