38.2 C
Hyderabad
April 29, 2024 12: 27 PM
Slider ముఖ్యంశాలు

ఆశల ఐక్య పోరాటాల వల్లనే సమస్యల పరిష్కారం

#AashaWorkers2

తెలంగాణ వాలంటరీ హెల్త్ (ఆశా )వర్కర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐక్య పోరాటాల వల్లనే సమస్య ల పరిష్కరానికి హామీలు వచ్చాయని సీఐటీయూ ములుగు జిల్లా ఉపాధ్యాక్షులు గుండెబోయిన రవిగౌడ్ ఆశా జిల్లా అధ్యక్షురాలు రత్నం నీలాదేవి అన్నారు.

ములుగు సీఐటీయూ ఆఫీస్ లో ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వారు మాట్లాడుతూ ఈనెల 25 న హైదరాబాద్ హెల్త్ కమిషనర్ కార్యాలయంలో ఆశ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆశాల సమస్యలపై కమిషనర్ వాకాటి కరుణ చర్చించి పరిష్కరానికి హామీలు ఇచ్చారని తెలిపారు.

ఆశా లకు రూ.7500 తగ్గకుండా ప్రతి నెల వేస్తామని, కరోనా ఇన్సూరెన్స్ యాభై లక్షలు, ఏపి తరహాలో పదివేలు ఫిక్స్డ్ వేతనం తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోతానని తెలిపారు.

దీనితో ఈనెల 28, 29, 30 తేదీలలో జరుపుకోవాలని అనుకున్న సమ్మె ను వాయిదా వేసినట్లు తెలిపారు. ములుగు జిల్లా కమిటీ తరపున ఈ కార్యక్రమంలో రజిత, కవిత, భాగ్య, అనిత, పాపా, నాగమణి, సుశీల, సుగుణ, ప్రభ, కనక లక్ష్మి, శ్రావణి, సుధా, రమా పాల్గొన్నారు.

Related posts

రివెంజ్:కాశ్మీర్‌లో సిఆర్‌పిఎఫ్ శిబిరాలపై గ్రెనేడ్లతో దాడి

Satyam NEWS

కరోనా వ్యాక్సినేషన్: రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ వెబ్ ఎక్స్ మీటింగ్

Satyam NEWS

లేబర్ ఆఫీసర్ ను హత్య చేసిన టీఆర్ఎస్ నాయకుడు

Satyam NEWS

Leave a Comment