34.7 C
Hyderabad
May 4, 2024 23: 33 PM
Slider నల్గొండ

ఘనంగా ఐ ఎన్ టి యు సి నేత డా.జి.సంజీవరెడ్డి జన్మదినం

#intuc

ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు హుజూర్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్,ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి,ట్రేడ్ యూనియన్ అభివృద్ధికి సంజీవరెడ్డి ఎంతగానో కృషి చేశారని అన్నారు. 1950 నాటికే సంజీవరెడ్డి ఎదురు లేని కార్మిక నాయకులైనారని, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారని, అత్యంత జఠిలమైన కార్మిక సమస్యల కోసం అంతర్జాతీయ,జాతీయ స్థాయిలో పోరాటాలు చేశారని గుర్తు చేశారు.

1948 లో యువ కార్మిక నాయకుడిగా చేరి 1950 లో ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రటరీ గా,ఆంధ్రప్రదేశ్ శాఖకు ఎన్నికయ్యారని,జాతీయ స్థాయిలో అనేక రంగాల్లో విద్యుత్,బొగ్గు,ఆరోగ్య, వైద్య,ఇంజనీరింగ్,రసాయన,మున్సిపల్, సిమెంట్, స్టీల్,సిగరెట్,బీడీ కార్మికుల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేశారని అన్నారు.1994 ఆగస్టు 3న,ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారని,1988 లో అంతర్జాతీయ కార్మిక సమాఖ్యకు ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారని, అంతర్జాతీయ కార్మిక సంస్థ జెనీవాలో జరిగిన సమావేశంలో భారతదేశ ప్రతినిధిగా సామాజిక అభివృద్ది అంశంపై సమావేశంలో ప్రాతినిధ్యం వహించారని యరగాని నాగన్న గౌడ్ తెలిపారు.కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు ట్రేడ్ యూనియన్లు రాజకీయాల్లోకి రావాలనే నినాదంతో 1962 లో మొదటి సారిగా శాసనసభ్యుడు గా ఎన్నికయ్యారని, 1967 లో రెండవ దఫా ఎన్నికైన వ్యక్తి సంజీవరెడ్డి అని,1968-1971 కార్మిక, ఉపాధి శాఖా మంత్రిగా సేవలందించిన మహనీయుడని కొనియాడారు.

రాజ్యసభ సభ్యుడుగా ప్రాతినిధ్యం వహించి ఎ ఐ సి సి కార్మికుల సెల్, సిడబ్ల్యుసి శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారని,జాతీయ సమగ్రతా మండలిలో సభ్యుడిగా ఉన్నారని అన్నారు.సంజీవరెడ్డి రెడ్డి కార్మికులకు చేసిన సేవలను గుర్తించి మహాత్మాగాంధీ కాశి విద్యాపీఠ్ వారణాసి గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించిందని గుర్తు చేశారు.కార్మిక వర్గాలకే కాక భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే గొప్ప నాయకుడుగా ఎదగాలని యరగాని నాగన్న గౌడ్ ఆకాంక్షించారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

డోంట్ రిపీట్: ఒకసారి కొట్టేసాక పిటిషన్ మళ్ళీ వేస్తారా

Satyam NEWS

పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టులు హతం

Satyam NEWS

విద్యలనగరం లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష…!

Satyam NEWS

Leave a Comment