38.2 C
Hyderabad
April 29, 2024 12: 08 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ చింతలపల్లికే..

#chintalapallijagadishreddy

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్  నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మొదటి నుండి అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచింది. టిఆర్ఎస్ పార్టీ నుండి జూపల్లి కృష్ణారావు రెండు సార్లు గెలిచించారు. ఒకసారి  టిడిపి పార్టీ నుండి మధు సుధన్ రావు గెలిచారు.

ఇలా చూసుకుంటే ఎక్కువగా  నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చలాయించింది. దీనితో కాంగ్రెస్ పార్టీకి కొల్లాపూర్ కంచుకోటగా మారింది. ఏ నాయకుడైనా సరే కొల్లాపూర్ నుండి అయితే కాంగ్రెస్ పార్టీ నుండి  పోటీ చేస్తే గెలుస్తామని అనుకుంటారు..గత 2018 ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలకు ఒక్క స్థానం కొల్లాపూర్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది.

ఇది కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు. అయితే ఎక్కువగా ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఇతర పార్టీలోకి వెళుతున్నారు. గత ఎన్నికలే  దీనికి ఉదాహరణ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన భీరం హర్షవర్ధన్ రెడ్డి (బి)టిఆర్ఎస్ పార్టీలోకి వలస వెళ్లారు. అయితే ఆ రోజు నుండి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించే పరిస్థితులు లేకున్నాయి.

కొంతమంది కార్యకర్తలు,సీనియర్ నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీనీ ముందుకు నడిపించారు. అనంతరం చింతలపల్లి జగదీశ్వర్ రావు, రంగినేని అభిలాష్ రావు ఇద్దరూ ప్రస్తుతం బిఆర్ఎస్ (టిఆర్ఎస్) పార్టీ నుండి వచ్చిన వాళ్లే. వీలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. నాయకులు కూడా సమస్యలపై ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఈ సమయంలో ఆశావాహులు చాలావరకు కాంగ్రెస్ పార్టీలో  వారే కాకుండా కొందరు బహుజన నాయకులు కూడా ఉన్నారు.

ఈ మధ్యలో జోడో యాత్రలో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ వెంట పాదయాత్ర చేసిన కేతూరి  వెంకటేష్  తో పాటు మరి కొందరు ఆశావహులు ఉన్నారు. అయితే  నియోజకవర్గంలో ఎవరికి వాళ్లు పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి పని చేస్తున్నారు. ఎవరికి వరకు టికెట్ వస్తుందని వ్యక్తం చేస్తున్నారు.

చివరికి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిజెఆర్

జిల్లా,స్థానిక  ఓ బి సి నాయకులు ప్రతి కార్యక్రమంలో, ప్రతి సభలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి చింతలపల్లి జగదీశ్వర్ రావు పోటీ చేస్తారని, వారే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిక మెజార్టీతో గెలిపించాలని మైక్ చేతిలో పట్టుకొని పబ్లిక్ లో మాట్లాడుతున్నారు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చింతలపల్లి జగదీశ్వర్ రావు కూడా ప్రజలను కోరుతున్నారు. అయితే ఇంతమంది నేతలు టికెట్ రేసులో ఉన్న కానీ ఒక ఓబీసీ నాయకుడు మాత్రం చింతలపల్లి జగదీశ్వర రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ప్రకటించడం పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తన వ్యక్తిగత సమస్యల వలన చింతలపల్లి జగదీశ్వర్ రావు తో మెప్పు పొందడానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుందో, ఏం ఆదేశాలు జారీ చేసిందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ విధంగా అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఆశవాలు అసంతృప్తితో ఉన్నారని మాటలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి బీసీలకే కాంగ్రెస్ టికెట్ వస్తుందని దిమా వ్యక్తం చేస్తున్నారు.

మరికొంతమంది ఈసారి 65 ఏళ్లు లోపల ఉన్న వారికే కాంగ్రెస్ టికెట్ వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.యువకులకే అవకాశం వస్తుందని అంటున్నారు. ఈ రకంగా చింతల పల్లి జగదీశ్వర్ రావు కు 70ఏండ్ల పై చిలుకే ఉన్నాయి.ఏది ఏమైనా చింతల పల్లి పై ప్రజలు సెంటిమెంట్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. అంతే కాదు మన ఊరు – మన పోరు సభ నిర్వహించి కాంగ్రెస్ కార్యకర్తలలో  నయ జోష్ నింపారని ఉంది.

ఓ వైపు బీసీల నుండి టికెట్ ఆశించే వారిలో పెద్ద వయసు ఉన్నవారు ఉన్నారు.మహిళలు కూడా ఉన్నారు.యువనాయకులు కూడా ఉన్నారు. రంగినేని అభిలాష్ రావు కూడా టికెట్ వస్తుందనే ధీమాలో ఉన్నారు.ప్రజలలో రాజకీయ విలువలు కలిగిన నాయకుడిగా రంగినేని పేరు తెచ్చుకున్నారు.అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,విజయానికి పని చేస్థానని చెప్తున్నారు.

చివరి దాకా టికెట్ కోసం ప్రయత్నం చేస్తానని అంటున్నారు.. మరి అభ్యర్థులను ప్రకటించడంపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎన్నికలకు మరికొన్ని నెలలు అత్రమే ఉన్నాయి పరిణామాలు ఏ విధంగా మారుతాయో వేచి చూడాల్సిందే.వీరందరనీ  కాదని అధిష్ఠానం  ఇతర నేతలకు టికెట్ ఇచ్చే అవకాశం  ఉందని కూడా కొందరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది ఎవరైనా టికెట్టు ఆశించవచ్చనీ అంటున్నారు.

Related posts

సబితని కలిసిన సండ్ర

Sub Editor 2

భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసిఆర్ అహంకారాన్ని వీడాలి

Satyam NEWS

బోణాల జాతర

Satyam NEWS

Leave a Comment