Slider ఖమ్మం

గద్దర్ మృతి చాలా బాధాకరం

#Puvvalla Durga Prasad

ప్రజా యుద్ధ నౌక గా పేరు తెచ్చుకుని నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన యోధుడు గద్దర్ ఆకస్మిక మరణం చాలా బాధాకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఆయన సంతాప సభ ఏర్పాటు చేశారు.గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం లో భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో గద్దర్ అడుగులో అడుగేసి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తో రాష్ట్రంలో పెను మార్పు జరుగుతుందని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర ఆయన చేసిన సెలవలను సువర్ణ అక్షరాలతో లికించదగినవని తెలిపారు. తెలంగణవాదులకు, ప్రజాస్వామ్య వాదులకు ఆయన మరణం తీరని లోటని అన్నారు. చివరి సారిగా ఖమ్మం లో జరిగిన భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొని ఖమ్మానికి తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాడిన పాటలు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతాయని అన్నారు.గద్దర్ కుటుంబ సభ్యులకు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుతున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

Related posts

వీరవిధేయుడిని ఆ పోస్టులో ఎలా నియమిస్తారు?

Satyam NEWS

కులవివాదంలో చిక్కుకున్న ఏపి హోం మంత్రి

Satyam NEWS

ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Murali Krishna

Leave a Comment