23.2 C
Hyderabad
May 7, 2024 19: 08 PM
Slider ఖమ్మం

సమస్యల పరిష్కారంకు సత్వర చర్యలు

#Abhilash Abhinav

ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ మదుసూదన్‌ నాయక్‌తో కలిసి ‘‘గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు.

ఈ సందర్భంగా తల్లాడ మండలం ముద్దునూరుకు చెందిన ఇమ్మడి రామకృష్ణ తాను ముద్దునూరు గ్రామ పంచాయితీలో ఎంపిడబ్లూగా విధులు నిర్వర్తించే వాడినని తనను అకారణంగా విధుల నుండి తొలగించడం జరిగిందని, తనకు న్యాయం చేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించడం జరిగినదని తేది.08-06-2023న కోర్టు ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని ఆయినప్పటికి కోర్టు ఉత్వర్వులను అమలు చేయడం జరగలేదని తనకు న్యాయం చేకూర్చాల్సిందిగా సమర్పించిన దరఖాస్తును 24 గంటల వ్యవధిలోచర్యలు తీసుకొని నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా పంచాయితీ అధికారిని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు.

చింతకాని మండలం గాంధీనగర్‌ కాలనీకి చెందిన బీమరాజు నాగసరిత తాను ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవడం జరిగినదని తనకు ఓటరు కార్డుకై చేసిన దరఖాస్తును సంబంధిత తహశీల్దారు గారు ఇప్పటి వరకు ఏ కారణం చేత ఓటరు ఐడి కార్డుకు దరఖాస్తు చేయలేదనే కారణంతో అట్టి దరఖాస్తును తిరస్కరించారని, విచారణ చేసి తనకు ఓటరు ఐడి కార్దు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం అసిస్టెంట్‌ రిటిర్నింగ్‌ అధికారి చింతకానిని ఆదేశించారు.

రామకృష్ణాపురం గ్రామం చింతకాని మండలంకు చెందిన శనగవరపు శ్రీనివాస్‌ తాను బి.సి (కుమ్మరి) కులమునకు చెందిన వాడనని తాను ఆన్‌లైన్‌లో కులవృత్తి దారుల ఆర్దిక సహాయంకై దరఖాస్తు చేసుకొన్నానని మంజూరు ఆయినట్లు తెలిపినారు కాని నాకు చెక్కు అందలేదని తాను వికలాంగుడినని తనకు ఆర్ధిక సహాయం అందించి ఆదుకోగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం మండల పరిషత్తు అభివృద్ధి అధికారి చింతకానికి ఆదేశించారు.

బీసీ స్టడీ సర్కిల్‌ నందు శిక్షణ పొందుతున్న విద్యార్ధులు తమకు ఇచ్చే స్టయిఫండ్‌, స్టడీ మెటీరియల్‌ రెండు నెలలుగా అందించడం లేదని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిని ఆదేశించారు. ఖమ్మం రూరల్‌ మండలం వెంకటగిరి గ్రామంకు చెందిన బొల్లినేని సీతమ్మ భర్త బొల్లినేని రోషయ్య (లేటు) తమకు గల వ్యవసాయ భూమిని ముగ్గిరు కుమారులకు ఒక్కొక్కరికి ఐదు ఎకరముల చొప్పున ఇవ్వడం జరిగినదని, ఇప్పు తన కొడుకులు తన బాగోగులు పట్టించుకోవడం లేదని, 13 కుంట భూమి తన భర్త పేరున ఉన్నదని అట్టి భూమిని, ఖాతాలో గల లక్ష రూపాయలను తన పేరున మార్చు చేయగలరని సమర్పించిన దరఖాస్తు సీనియర్‌ సిటిజన్స్‌ యాక్కు క్రింద తెగు చర్య నిమిత్తం రెవెన్యూ డివిజనల్‌ అధికారి, ఖమ్మంను ఆదేశించారు.

ఖమ్మం నగరం నిజాంపేటకు చెందిన దొనగిరి బాలరాజు తన తాత, తండ్రి గారికి సంబంధించిన ధంసలాపురం రెవెన్యూ పరిధిలో సర్వేనెం.28/లులో 2 ఎకరముల 0.07 గుంటల భూమి కలదని అట్టి భూమికి సంబంధించి 2000-21 నుండి 2004-05 వరకు పహాణిలలో నమోదు కావడం జరిగినదని అట్టి భూమిని వారసత్వ పౌతి పట్టా దారు పుస్తకము ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఖమ్మం అర్భన్‌ తహశీల్దారును ఆదేశించారు.

Related posts

అమృత్ ఉద్యాన్ గా మొఘల్ గార్డెన్స్

Murali Krishna

జస్టిస్ వాంటెడ్: ప్రాజెక్టులను సందర్శిస్తే అరెస్టు చేస్తారా?

Satyam NEWS

నడి రోడ్ పై త్రిబుల్ రైడింగ్.. అదీ ట్రాఫిక్ పోలీసులు ఉండగానే…!

Satyam NEWS

Leave a Comment