33.2 C
Hyderabad
May 4, 2024 00: 08 AM
Slider కవి ప్రపంచం

సోల్జ‌ర్‌కు శాల్యూట్…

#TirunagariSrinivasNew

మార్పును కోరిన క‌వి

ఉద్య‌మాల ఉదయ‌మైన ర‌వి

పాట‌నే ఆయుధంగా ఎక్కుపెట్టిన

పోరాటాల పొద్దు పొడుపు

గ‌ర్జించిన ప్ర‌జా గొంతుక

ఆకాశ‌మంతెత్తుకు

పాటల జెండాను ఎగ‌రేసిన సూర్యుడు

స‌మాజ‌ స‌మూహంలో

ధైర్య‌పు న‌డ‌క‌ల‌ను ప‌ర‌చిన సైనికుడు

జ‌న‌మే ఆ గ‌ళానికి భూమిక

అంతెర‌గ‌ని అనంత‌మే

అలుపెరుగ‌ని క‌ద‌లికే

ఆ పాట‌కు మ‌హా మాతృక‌

పీడ‌న‌పై  ఎదిరింపే

ఆ ప్ర‌చండ భావాల‌కు వాహిక

మ‌ర‌ణం దేహానికే కాని

ఉజ్వ‌ల‌మై వెలిగే పాట‌కెక్కడిది?

క‌దం తొక్కిన ఆ కాలిగ‌జ్జెల‌కి

ఎదురెర‌గ‌ని భుజ‌పు న‌ల్ల‌గొంగ‌డికి

అస‌మాన‌మైన ఆ రాగాలాప‌నికి

ఆ ఆట‌కు

ఆ పాట‌కు

ఆ గాన‌వీచిక‌కు

ప్ర‌పంచాన్నిపాటై  ప‌ల‌క‌రించిన

ఆ అపూర్వ‌ గ‌ళ సీమ‌కు

ఆ జ‌న వాగ్గేయ‌కారునికి వంద‌నం

ప్ర‌జాయుద్ధ‌నౌకకు సాల్యూట్…

( ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్దర్‌కు నివాళి…)

– డా. తిరున‌గ‌రి శ్రీనివాస్, 8466053933

Related posts

ప్రభుత్వ విధానాలు దేశానికే ఆదర్శం: మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

నిలిచిపోయిన పోలింగు తక్షణమే పునరుద్ధరిస్తారా?

Satyam NEWS

సందడిగా సాగుతున్న పల్నాడు సంబరాలు…

Satyam NEWS

Leave a Comment