38.2 C
Hyderabad
April 28, 2024 21: 15 PM
Slider ఖమ్మం

విద్యతోనే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు

#Parisha Pullaiah

విద్యతోనే ఉన్నత చేరుకోగలమని పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు పరిశ పుల్లయ్య తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. ఖమ్మంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఐఐటిలో స్థానం సంపాదించిన విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్టు ద్వారా ఒక్కొక్కరికీ రూ. 20వేల ఆర్థిక సాయం అందించారు.

నిరుపేద కుటుంబానికి చెందిన రఘునాథపాలెం గ్రామానికి చెందిన బుట్టి కీర్తిప్రియ గురుకుల కళాశాలలో చదివి ఐఐటి కాన్పూర్లో సీటు సంపాదించింది. ఈమె నిరుపేద దళిత కుటుంబానికి చెందినది కావడం, ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ట్రస్టు తరుపున రూ. 20వేల చెక్కును పరిశ పుల్లయ్య అందజేశారు. ఇదే కళాశాలలో చదివి తెల్దారుపల్లి గ్రామానికి చెందిన పాము యశస్విని ఐఐటి పాల్కాడ్లో స్థానం సంపాదించింది.

ఈమెకు కూడా ట్రస్టు తరుపున రూ. 20వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి కోసం ట్రస్టు కృషి చేస్తుందన్నారు. ఉత్తమ విద్యార్థులకు ఆర్థికంగా దన్నుగా నిలవడం విద్యాలయాలలో మౌలిక వసతులు కల్పించడం ధ్యేయంగా పిఎస్ఆర్ ట్రస్టు పని చేస్తుందన్నారు. ఆర్ వో కొత్తపల్లి ప్రత్యూష మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ట్రస్టు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

ఈ ఒక్క కళాశాలలోనే దాదాపు 15మందికి భారీగా ఆర్థిక సాయం అందజేశారని వారి ఆర్థిక సాయంతో అనేక మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని ఆమె తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి చేయూత నిచ్చేందుకు పిఎస్ఆర్ ట్రస్టు మార్గదర్శిగా వ్యవహరిస్తుందని ఆమె తెలిపారు. విద్యా దానం ఎంత గొప్పదో విద్యను అభ్యసించేందుకు ఊతగా నిలవడం కూడా అంతే గొప్ప విషయమని ప్రత్యూష తెలిపారు.

కళాశాల విద్యార్థులకు దన్నుగా నిలవడమే గాక విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న పరిశ పుల్లయ్యను అధికారులు, అధ్యాపక సిబ్బంది గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చావా జ్యోతి, అధ్యాపక బృందం దామాల రాంకోటి, పాషా, బోసు, వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వ్యవ‘సాయం’ అందుకోవడంలోనూ ఏపీ దిగదుడుపే!

Satyam NEWS

రౌడీలా వ్యవహరిస్తున్న టిఆర్ఎస్ పార్టీ కి చెందిన కాంట్రాక్టర్

Satyam NEWS

ధాన్యం సేకరణ లో వేగం పెంచాలి

Bhavani

Leave a Comment