32.2 C
Hyderabad
May 12, 2024 20: 15 PM
Slider ఖమ్మం

ఖమ్మంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్  ఆంక్షలు

#khammampolice

వినాయక నిమజ్జనం కోసం  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించినట్లు ఖమ్మం  పోలీస్  కమీషనర్ విష్ణు యస్. వారియర్  శుక్రవారం తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం నగరంలోని కాల్వ వొడ్డు సమీపంలోని మున్నేరు, ప్రకాష్ నగర్  శివారు ప్రాంతంలోని మున్నేరు వాగు వద్ద గణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం ఏర్పాట్లను  చేపట్టారని తెలిపారు.  ట్రాఫిక్ ఆంక్ష‌ల నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్-19) ప్రజలు గణేష్ శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా  జిల్లా పోలీస్,  రెవిన్యూ, మున్సిపల్ , ఆర్ అండ్ బి, వైద్య, విధ్యుత్ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమీషనర్  తెలిపారు .

విగ్రహాల నిమజ్జనం ప్రాంతాలలో సీసీ కెమెరాలు, బారికేడ్లను ఏర్పాటు చేసి నిరంతరం పోలీస్ నిఘాలో పర్యవేక్షణ వుంటుందని  తెలిపారు.  ఖమ్మం జిల్లాలో  సుమారు 1700 గణేష్  విగ్రహాలను వివిధ ప్రాంతాలలో నిమజ్జనం చేస్తారనే అంచన వుందన్నారు. సకాలంలో  నిమజ్జనం  ముగిసేవిధంగా ఉత్సవ కమిటీలు చొరవ తీసుకొవాలని సూచించారు.

శోభయాత్రలో సౌండ్ సిస్టమ్ , డిజెల వినియోగం నిషిద్ధమని, వాహనాల డ్రైవర్లు  మద్యం, మత్తు పానీయాలు సేవించవద్దని నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రజలు, నిర్వహకులు పూర్తి సహకారం అందించారని అదే స్పూర్తితో పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమం శాంతియుత వాతావరణంలో  విజయవంతం చేయాలని కోరారు.

ఖమ్మం నగరంలో గణేష్ శోభాయాత్ర సాగే మార్గాలు

శ్రీరామ్ హిల్స్, సంభాని నగర్, ముస్తాఫానగర్,చర్చికాంపౌండ్, కమాన్ బజార్, కస్బాబజార్ , స్టేషన్ రోడ్, బోనకల్ రోడ్డు మరియు జడ్ పి సెంటర్ ప్రాంతాలకు చెందిన  గణేష్  విగ్రహాలు  చర్చి కంపౌండ్, పటేల్ టింబర్ డిపో మీదుగా  ప్రకాష్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్   వద్దకు కాని  లేదా పటేల్ టింబర్ డిపో,  గుట్టల బజార్, గాంధీ చౌక్ మీదుగా నయాబజార్ చేరుకోవాలి.

రాపర్తినగర్, బుర్హాన్ పురం, మామిళ్ళగూడెం, సరిత క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్ కు చెందిన  విగ్రహాలు బస్ డిపో, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, మయూరి సెంటర్, కిన్నెర సెంటర్, జడ్పీ సెంటర్ ,చర్చి కంపౌండ్ పటేల్ టింబర్ డిపో మీదుగా  ప్రకాష్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్   వద్దకు కాని  లేదా పటేల్ టింబర్ డిపో,  గుట్టల బజార్, గాంధీ చౌక్ మీదుగా నయాబజార్ చేరుకోవాలి.

రోటరీనగర్, ఇందిరానగర్, వీడియోస్ కాలనీ, నెహ్రూ నగర్, బ్యాంక్ కాలనీ, కవిరాజ్ నగర్ కు చెందిన  విగ్రహాలు ఇల్లందు క్రాస్ రోడ్డు , జడ్ పి సెంటర్ , చర్చి కంపౌండ్, పటేల్ టింబర్ డిపో, మీదుగా  ప్రకాష్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్   వద్దకు కాని  లేదా పటేల్ టింబర్ డిపో, గుట్టల బజార్, గాంధీ చౌక్ మీదుగా నయాబజార్ చేరుకోవాలి.

యు పి హెచ్ కాలనీ  ,ఖానాపురం, బల్లేపల్లి, బాలపేట కు చెందిన  విగ్రహాలు   ఎన్ టి ఆర్ సర్కిల్ , ఇల్లందు క్రాస్ రోడ్డు , జడ్ పి సెంటర్ , చర్చి కంపౌండ్, పటేల్ టింబర్ డిపో మీదుగా  ప్రకాష్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్   వద్దకు కాని  లేదా పటేల్ టింబర్ డిపో,గుట్టల బజార్, గాంధీ చౌక్ మీదుగా నయాబజార్ చేరుకోవాలి.

సారధి నగర్, ఎఫ్ సి ఐ గొడౌన్, వేంకటేశ్వర నగర్ చెందిన  విగ్రహాలు   నెహ్రూ విగ్రహం, జూబ్లి క్లబ్, ఎమ్మార్వో ఆఫీస్ గాంధీ చౌక్ , నయాబజార్ చేరుకోవాలి.

ఖమ్మం  త్రీ టౌన్ పోలీస్  స్టేషన్  పరిధిలో మిగిలిన విగ్రహాలు  మొత్తం గాంధీ చౌక్, పీఎస్సార్ రోడ్డు, ట్రంక్ రోడ్డు , నయాబజార్ చేరుకోవాలి.

తిరుగు ప్రయాణంలో నిమజ్జనం పూర్తయిన వాహనాలు అన్నీ కూడా హిందూ స్మశాన వాటిక, పిల్లి చిన్ని కృష్ణయ్య తోట ,ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పంపింగ్ వెల్ రోడ్, బోసుబొమ్మ సెంటర్ ,చర్చి కంపౌండ్ ద్వారా వెళ్లవలెను.

గణేష్ నిమజ్జనం సందర్భంగా 19వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి నాయుడు పేట నుండి వచ్చే  అన్ని  వాహనాలను మళ్లించి ములకలపల్లి క్రాస్ రోడ్డు ,బైపాస్ రోడ్డు  మీదుగా  ఖమ్మం  టౌన్ లోనికి  అనుమతించబడును.

ఖమ్మం పట్టణంలో నుండి హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే వాహనాలను నెహ్రూ విగ్రహం, ఎఫ్సీఐ ద్వారా బైపాస్ రోడ్ మీదుగా అనుమతించబడును.

గణేష్ నిమజ్జన సమయంలో చిన్నారులు  లేకుండా విగ్రహాల వెంట ఇద్దరు మాత్రమే వెళ్లాలని సూచించారు. మయూరి  బిడ్జీ మీదుగా గణేష్  వాహనాలను అనుమతించబడవు.

జిల్లావ్యాప్తంగా  పోలీస్  బందోబస్తు 

ఎసిపిలు- 05 సిఐలు 13,   యస్ ఐ లు 28,  ఎ యస్ ఐ లు, హెచ్ సి లు 29, పిసి లు100,మహిళా హెచ్ సిలు,మహిళ పిసి లు  10, అదనంగా మరొ   50,  మంది ఉంటారని తెలిపారు.

Related posts

తిరుపతి చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Bhavani

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం

Satyam NEWS

బ్రెజిల్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

Sub Editor

Leave a Comment