33.2 C
Hyderabad
March 26, 2025 11: 05 AM
Slider నిజామాబాద్

8న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

general strike

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు నాగన్న అన్నారు. దీనికి నిరసనగా కేంద్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా  కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. పెట్టుబడిదారుల కబంధ హస్తాలలో చిక్కుకున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందన్నారు.

జనవరి ఎనిమిది న అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుకూలి సంఘం కార్యదర్శి వెంకట్ గౌడ్, సిఐటియు కన్వీనర్ సురేష్ గొండ, గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం నాయకులు వీరయ్య, అంగన్వాడీ కార్మికుల సంఘం నాయకులు రాళ్లు అనుసుజా, చెంప బాయి, వికలాంగుల నాయకులు సాయిలు, రైతు సంఘం నాయకులు మోతీలాల్ విట్టల్, మధ్యాహ్న భోజన నిర్వహకురాలు సంఘం నాయకురాలు సరస్వతి, ఆయా మండలాల గ్రామాల కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Related posts

గ్రామాల అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం: మంత్రి పువ్వాడ

Satyam NEWS

విద్యల నగరానికి తొలిసారిగా ఐదుగురు జడ్జిలు రాక

Satyam NEWS

అర్ధరాత్రి విజయనగరం లో ఆపరేషన్ నైట్ స్టార్మింగ్…!

Satyam NEWS

Leave a Comment