36.2 C
Hyderabad
May 7, 2024 13: 24 PM
Slider హైదరాబాద్

ఉచిత హామీలతో ప్రజా జీవితాలతో చెలగాటం!

Parties

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఉచితం అస్ర్తాన్ని భారీగానే ప్రయోగిస్తున్నాయి. అధికార పార్టీ మంచినీరు, విద్యుత్ ఫ్రీ అంటుండగా, ఒక అడుగు ముందుకేసి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అధికార పార్టీ బైర్లు కమ్మేలా ఉచిత అస్ర్తాలను ప్రయోగించి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నాయి.

వాస్తవం ఏంటీ?

అన్ని పార్టీలు ఫ్రీ అనే అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నప్పటికీ వీటి పరిణామాం చాలా తీవ్రంగానే ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నాయి. ఇలా ఏది పడితే అది ఉచితం అని ప్రకటించడం వాటికో లెక్కా పత్రం లేకుండా ఓట్లు దండుకోవడం అనేది సాధ్యపడినంత తేలిక కాదని వారి వాదన. దీని ద్వారా ఆయా ఉచిత హామీల వల్ల జరిగే నష్టాన్ని ఏదో ఒక రూపంలో రాష్ర్ట ప్రభుత్వం, లేదా అధికారంలోకి వచ్చే పార్టీలు భరించాల్సి ఉంటుంది. ఇది ఏలా సాధ్యపడుతుందయ్య అంటే అది చెప్పడం ఎవ్వరికీ సాధ్యపడదు.

వేరే ఆదాయ మార్గాలపై భారం తప్పదు

మరోవైపు పైన పేర్కొన్న అన్ని హామీలను అమలు చేసిన దాని ప్రభావం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు అధికారంలో ఉన్న పార్టీ ఏ విధమైన చర్యలు చేపడుతుంది. తిరిగి వేరే విధంగా నష్టాన్ని పూడ్చుకుంటున్నదన్నది విశ్లేషకుల వాదన. ఇది ఏ రూపంలో అంటే కరెంటు ఫ్రీ అంటే దీని ద్వారా జరిగే నష్టాన్ని పెట్రోల్పైనే, డిజీల్పైనో, లేదా తినుధాన్యాలపైనే లేదా ట్యాక్సు రూపేణానో ఇలా అనేక ఆదాయ వనరులుగా ఉన్న మార్గాలపై మరింత భారం వేయాల్సి రావడం ఖాయం. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ కాస్త బ్యాలెన్స్ తప్పడం ఖాయమని దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశాలు కూడా ఎక్కువేనని చెబుతున్నారు.

ఇక ప్రజలకు కావాల్సిన విద్యా, వైద్యం, ఉద్యోగం (రోటీ, కపడా, మకాన్)ల కోసం ఆయా ప్రభుత్వాలు చేస్తున్నప్రయత్నం అభినందించదగ్గదే అయినప్పటికీ దీని వల్ల ప్రజలు మరింత సోమరితనం అలవాటు చేస్తున్నారని కూడా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ఉచితం దేశ భవిష్యత్కు సంకటమే!

వీటన్నింటినీ ఇచ్చే కంటే ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం కల్పించి (పభుత్వ రంగంలో కానీ, ప్రైవేటు రంగంలో కానీ ప్రభుత్వాలు ఇస్తున్న జీతాలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రైవేటు వ్యక్తులకు కూడా ఇచ్చేలా) కార్మిక చట్టాల ప్రకారం జీతాలు చెల్లించేలా పకడ్భందీ చర్యలు తీసుకుంటే తద్వారా నిరుద్యోగం తగ్గి ప్రజల్లో చురుకుదనం పెరిగి మరింత పనితనానికి పూనుకుంటారు. దీని ద్వారా దేశ తలసరి జీడీపీ పెరగడంతోపాటు అన్నీ ఉచితం అన్నమాటనే ప్రజలు మర్చిపోయి, తమ కష్టాన్నే నమ్ముకొని బ్రతుకుతారు తప్పితే ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. అసలు ప్రభుత్వాలు చేయాల్సిన ప్రయత్నం ఈ దిశలో ఉండాలే తప్ప అన్ని ఫ్రీ, అంతా ఉచితం అని ప్రకటిస్తున్న రాజకీయ ధోరణి దేశ ప్రజలకు వారి భవిష్యత్ తరాలకు కూడా ఏ మాత్రం మంచిది కాదనేది జగమెరిన సత్యం.

ఉచితంతో ఒరిగేదేంది?

దోచుకొని దాచుకోవడం కంటే.. కష్టపడి సంపాదించి దాచుకోవడం అనేది ప్రజలకు అలవాటు చేస్తే మంచిది. పెద్ద పెద్ద దేశాల్లోని మహానీయులు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తూ ఆయా దేశాలను నెంబర్ 1 స్థానాల్లో నిలబెట్టడానికి ఇలాంటి చర్యలే కారణమనేది మనదేశ రాజకీయ నేతలు నేర్చుకున్నట్లు లేదు.. లేదా నేర్చుకున్నా.. ప్రజలకు వివరించే పరిస్థితిలో లేరేమో మరీ! ఆ మాత్రం ధైర్యం చేయలేని నేతలు ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటారే తప్ప దీంతో ప్రజలకు ఒరిగిందేమీ ఉండదనేది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అక్షరసత్యం. రాత్ గయీ.. బాత్ గయీ.. (రాత్రి అయిపోయింది.. మాట్లాడిన మాటలూ అయిపోయాయనే) రీతిలో ప్రజాపాలన కొనసాగిస్తే అది మానవాళి మనుగడకే ముప్పు పరిణమించే అవకాశం ఎంతో దూరంలో ఉండదనేది గుర్తించాలి.

- పడకంటి నాగరాజు

Related posts

గ్రీన్ ఫెస్టివల్: పండుగలా ప్రారంభమైన హరితహారం

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

ఎమ్మెల్యేలను చీకాకుపెడుతున్న ఐప్యాక్ సర్వేలు

Satyam NEWS

Leave a Comment