37.2 C
Hyderabad
May 6, 2024 12: 56 PM
Slider హైదరాబాద్

ఉధృతంగా కొనసాగుతున్న జిహెచ్ఎంసి కార్మికుల సమ్మె

#ghmc

జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ కాప్రా సర్కిల్ కార్యాలయంలో చేపట్టిన సమ్మె గురువారం నాటికి ఆరవ రోజుకు చేరుకుంది. గురువారం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్ అద్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు లంబు శ్రీనివాస్ గౌడ్ తోపాటు ఏఐటియుసి రాష్ట్ర నాయకులు విఎస్ బోస్, జిల్లా నాయకులు శంకర్ రావు, దామోదర్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి జి కె. మూర్తి, మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ మాజీ కౌన్సిలర్ రాములు యాదవ్, రాష్ట్ర మాజీ కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు తదితరులు సమ్మె కు సంఘీభావాన్ని ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు

కాలనీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాజేశ్వర్ రావు, విష్ణుమూర్తి, సంగయ్య, కృష్ణమూర్తి తదితరులు కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు రూ 15 వేల విరాళం అందజేశారు. గురువారం కార్మికులు పెద్ద ఎత్తున సర్కిల్ కార్యాలయం ఆవరణలో వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హక్కుల సాధన కోసం ఉద్యమం చేయాలని చెప్పిన కేటీఆర్ బాటలోనే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సూచించారు జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం కార్మికులపై వేధింపు చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కాప్రాలోని వివిధ యూనియన్ల నాయకులు కె. శివ కృష్ణ, సునీల్ మనోహర్, రామ రాజేశ్వర్, యాకస్వామి, కుర్మన్న, సుజాత, మంజుల, అంజలి, శ్యామల, శివయ్య, సాయిలు, బి. పరమేష్, ఎస్. నరసింహ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

జర్నలిస్ట్ కుటుంబానికి మంత్రి ఈటల చేయూత

Satyam NEWS

స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు

Satyam NEWS

రామోజీ ఫిల్మ్ సిటీలో వేసేవి కేసినోలా.. క్యాబరేలా.. బెల్లీ డ్యాన్స్ లా..?

Satyam NEWS

Leave a Comment