26.7 C
Hyderabad
May 3, 2024 07: 45 AM
Slider మహబూబ్ నగర్

గిరివికాసం పథకాలు తక్షణమే గ్రౌండింగ్ కావాలి

#girivikasam

గిరివికాసం పథకం కింద  దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు గ్రౌండింగ్ త్వరగా పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన ఛాంబర్ లో  గిరివికాసం పథకం అమలు పై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 568 రాగా 150 దరఖాస్తులు గ్రౌండ్ వాటర్ శాఖ ద్వారా సర్వే చేసి 143 బోర్లకు సిఫారసు చేసినట్లు తెలిపారు.  తిరస్కరించిన 122  దరఖాస్తులకు కారణాలు వ్రాయాలని పి.డి. డి ఆర్.డి.ఓ ను ఆదేశించారు.  సర్వే పూర్తి ఆయి పరిపాలన అనుమతి పూర్తి అయిన 116  అర్హులైన లబ్ధిదారుల వ్యవసాయ పొలాల్లో డ్రిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు బోర్ రిగ్గుల సంఖ్యను పెంచాలని సూచించారు. 

అన్ని మండల అభివృద్ధి అధికారుల కార్యాలయాల్లో గిరివికాసం మంజూరు కొరకు  వచ్చిన దరఖాస్తులు,  ఆమోదం పొంది పూర్తి అయిన వివరాల రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. ఇద్దరు ముగ్గురు  గిరిజన రైతులు ఒక క్లస్టరుగా ఏర్పడి సాగునీటికి బోరు బావి కావాలని దరఖాస్తు చేస్తే  వాటిని  డి.ఆర్.డి.ఓ కార్యాలయానికి పంపించాలని తెలియజేసారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, అటవీ శాఖ అధికారి కిష్టా గౌడ్, పి.ఓ ఐ.టి.డి.ఏ  అశోక్, పిడి డి.ఆర్.డి.ఏ నర్సింగ్ రావు, జిల్లా భూగర్భ జల అధికారి రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

అన్విక ఆడియో ద్వారా “ఆదిపర్వం” పాటలు విడుదల

Satyam NEWS

43 కేంద్రాల్లో 15 వేల 388 మంది పరీక్ష రాస్తున్నారు…!

Satyam NEWS

న్యూ ఇయర్ నేపథ్యంలో ఏపిలో కొత్త మద్యం బ్రాండ్లు

Bhavani

Leave a Comment