28.7 C
Hyderabad
April 28, 2024 09: 24 AM
Slider ప్రత్యేకం

43 కేంద్రాల్లో 15 వేల 388 మంది పరీక్ష రాస్తున్నారు…!

#examcenter

జేఎన్టీయూ జంక్షన్ వద్ద ప్రత్యేకించి బస్సులను ప్రారంభించిన విజయనగరం జిల్లా పోలీసు బాస్…!

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ పరీక్ష ప్రారంభమైంది. విజయనగరం జిల్లాలో 43 కేంద్రాల్లో 15వేల 388 అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ దీపికా… అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే విధంగా ఎస్పీ దీపికా ప్రత్యేక చొరవ తీసుకుని శాఖకు చెందిన బస్సులను ఏర్పాటు చేశారు.అలాగే నిర్దేశించిన పరీక్షాకేంద్రాలను స్వయంగా.. ప్రత్యక్షంగా పరిశీలించారు.జిల్లాలో ప్రారంభమైన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష ప్రక్రియను ఎస్పీ పర్యవేక్షించారు.

పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తున్న అభ్యర్థుల హాల్ టికెట్లు, గుర్తింపు కార్డులను ఎస్పీ స్వయంగా పరిశీలించి, పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్ధులను అనుమతించారు..ప్రతీ అభ్యర్థిని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ప్రిస్కింగ్ చేసి, అనుమతించారు.పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సీటింగ్, ఇతర సౌకర్యాల సమీక్షతో పాటు, నియమ నిబంధనల ప్రకారం పరీక్షలు ఎలా నిర్వహించాలో ఇన్విజిలేటర్లకు, పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.కాఫీయింగ్ , తదితర అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా జరిగేలా పక్కాగా చర్యలు చేపట్టారు.ఇక

ఏపీఎస్ఎల్.పీ.ఆర్. బీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల ప్రాధమిక వ్రాత పరీక్ష నిర్వహించే  ఎంవీజీఆర్ ఇంజనీరింగు కళాశాలను ఎస్పీ ఎం.దీపిక, సందర్శించి, భద్రత ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు.విజయనగరం డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి సీఐ  జి.రాంబాబు, భోగాపురం సీఐ విజయనాధ్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

శరాఘాతాల్లా తగులుతున్న చిరువిమర్శలు

Satyam NEWS

ట్రంప్ వస్తున్న సమయాన సిఏఏ నిరసనల వెల్లువ

Satyam NEWS

Lantus Diabetes Medications

Bhavani

Leave a Comment