31.7 C
Hyderabad
May 7, 2024 02: 48 AM
Slider తెలంగాణ

ఫెస్టివల్ మూడ్ :అనుకున్నట్టే ఆడపిల్లలు పుట్టారు పండుగ చేశారు

girl child born festival mood

అబ్బాయిలు-అమ్మాయిల మధ్య జననాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో ఆడపిల్ల పుడితే బాగుండని గ్రామస్థులు అనుకున్నారు. వారి కోరిక నెరవేరింది. జనవరి తొలి వారంలో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో వారి సంతోషం అంబరాన్నంటింది. అందరూ కలిసి గ్రామంలో సంబరాలు చేసుకున్నారు.  మిఠాయిలు పంచుకుని వేడుక జరుపుకున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్‌పూర్ గ్రామంలో జరిగిందీ ఘటన.

గ్రామంలో మొత్తం 816 మంది నివసిస్తున్నారు. అయితే, అబ్బాయిలు-అమ్మాయిల మధ్య లింగ నిష్పత్తిలో అంతరం ఎక్కువగా ఉండడంతో ఆవేదన చెందారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు మనుగడకే ముప్పు రావొచ్చని భయపడ్డారు. ఇలా అయితే లాభం లేదని ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు.
జనవరి మొదటి వారంలో ముగ్గురు అమ్మాయిలు జన్మించడంతో నిన్న గ్రామంలో అందరూ కలిసి వేడుక చేసుకున్నారు. 

పంచాయతీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. అనంతరం అమ్మాయిల తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి సన్మానించారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పేర్లు నమోదు చేయించారు. ఒక్కో చిన్నారికి వెయ్యి రూపాయల చొప్పున  తొలి ఐదు నెలల మొత్తాన్ని జమ చేశారు. ఇందుకు సంబంధించి మూడు వేల రూపాయలను వారి చేతికి అందించారు. విషయం తెలిసిన ఇరుగుపొరుగు గ్రామస్థులు హరిదాస్‌పూర్ వాసులను అభినందిస్తున్నారు.

Related posts

అమరగాయకుడు బాలు..అందరి మదిలో చిరస్మరణీయుడు..

Satyam NEWS

ఆటోవాలాల పొట్ట కొట్టొదంటూ ఆటోల బంద్

Satyam NEWS

రాయలసీమ లిఫ్ట్ పనులను వెంటనే నిలిపివేయాలి

Satyam NEWS

Leave a Comment