33.2 C
Hyderabad
May 4, 2024 00: 56 AM
Slider విశాఖపట్నం

దేవాదాయ ధర్మాదాయ ఆస్తుల జాబితా ఇవ్వండి

#charity

కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారునికి వారం రోజుల్లోగా అందజేయాలని అనకాపల్లి జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఎస్‌.రాజారావును రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆదేశించింది. అనకాపల్లి,కశింకోట మండలాలు,గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌ పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌ ఛారిటబుల్‌, హిందూ మతపరమైన సంస్థలు,ఎండోమెంట్స్‌ చట్టం1987 పరిధిలోకి వచ్చే ఆస్తులు, కార్యాలయం విధులు, బాధ్యతలు,సేవలకు సంబంధించిన 17 అంశాల తాజా ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 4 (1) (బి) కాపీలను కోరుతూ సమాచార హక్కు,వినియోగదారుల రక్షణ చట్టాల ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ 2022 మార్చి 16న జిల్లా దేవాదాయ,దర్మాదాయ శాఖ కార్యాలయానికి దరఖాస్తు చేశారు.

నిర్ధేశిత గడువులోగా సమాచారం ఇవ్వకపోవడంతో అదే ఏడాది మే 9న విశాఖపట్నంలోని దేవాదాయ,ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు మొదటి అప్పీలు చేయగా కనీసం స్పందించలేదు. దీంతో సమాచారం కోరి ఏడాది దాటినా ఇవ్వలేదని, ఆర్టీఐ చట్టం అమలులో బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ వ్యవహరిస్తుందంటూ కాండ్రేగుల వెంకటరమణ రాష్ట్ర సమాచార కమిషన్‌కు అప్పీలు చేశారు.ఈ నేపధ్యంలో గత నెల 25న రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలో కేసు విచారణ జరిగింది.

విచారణలో ఇరువర్గాల వాదనలు విన్న ఆర్టీఐ కమిషనర్‌ ఆర్‌.శ్రీనివాసరావు తీర్పు కాపీ అందిన వారం రోజుల్లోగా దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని అందజేయాలని ఆదేశిస్తూ ఈ కేసు (అప్పీలు సంఖ్య : 19033/ఎస్‌ఐసీఆర్‌ఎస్‌ఆర్‌/2022)లో తీర్పు ఇచ్చారు. విచారణకు జిల్లా దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారి సీపాన రాజారావు హాజరయ్యారు.

25-5-2022), సీపాన రాజారావు 2 రోజులు (2022 మే 26, 27), పి.ఎస్‌.ఎన్‌.మూర్తి -4 రోజులు (తేది : 28-5-2022 నుంచి తేది : 1-6-2022), బండారు ప్రసాద్‌ 51 రోజులు (తేది : 1-6-2022 నుంచి 21-7-2022), కె.చంద్రశేఖర్‌ 99 రోజులు (తేది : 21-7-2022 నుంచి 27-10-2022), బి.ఎల్‌.నగేష్‌ 152 రోజులు (తేది : 21-7-2022 నుంచి 27-3-2023) బాధ్యతలు నిర్వహించగా ప్రస్తుతం సీపాన రాజారావు 28-3-2023 తేదీ ఈ నెల 14వరకు విధులు నిర్వహించారు. దేవాదాయ,దర్మాదాయ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండదన్న ప్రచారంకు ఈ చర్యలు ఊత మిస్తున్నాయి.

దీనికి రాజకీయ నాయకులు ఒత్తిళ్లు కూడా కారణమని తెలుస్తుంది. అందుకు నిదర్శనం దేవాదాయ, ధర్మాదాయ శాఖ జిల్లా అధికారి (ఇన్‌చార్జ్‌)గా 28-3-2023 తేదీ నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ తనను ఆ బాధ్యతల నుంచి తక్షణం తొలగించాలని, తాను వి-ధులు నిర్వహించలేకపోతున్నానని లిఖితపూర్వకంగా మొర పెట్టుకున్నా ఆయన్నే కొనసాగించడంలో ఆంతర్యం అనుమానాలకు తావిస్తుంది.

గతేడాది మే నెలలో రాజారావును జిల్లా అధికారిగా ప్రభుత్వం నియమిస్తే విధులు నిర్వహించిన రెండు రోజులకు చేతులెత్తేయడంతో ఆయన స్ధానంలో మరొకరు నియామకం జరిగిన విషయం గమనార్హం.

కారణాలేమైౖనప్పటికీ అనకాపల్లి జిల్లా కేంద్రం, మంత్రి గుడివాడ అమర్నాధ్‌, లోక్‌సభ సభ్యురాలు బి.వి.సత్యవతి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా దేవాదాయ,ధర్మాదాయ శాఖలో హిందూ దేవాదాయ,ధర్మాదాయ శాఖ సంస్ధల పరిపాలన, సదరు సంస్ధల ఆదాయం, నిధుల సద్వినియోగం, దాతల ఉద్దేశ్యాలు అమలు చేయుట,ఆస్తుల రక్షణ,భక్తులకు సౌకర్యాల కల్పన తదితర సేవలు అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.

జిల్లాలో దేవాదాయ,ధర్మాదాయ శాఖకు అనకాపల్లి, యలమంచిలి డివిజన్లలో ఇనస్పెక్టర్‌ కార్యాలయాలు, ఆరుగురు గ్రూపు దేవాలయాల ఇనస్పెక్టర్లున్నారు.కాగా జిల్లాలో 5,468.90 ఎకరాల భూములుండగా దీనిద్వారా ఏడాదికి రూ. కోటి ఆదాయం సమకూరుతుంది.ఇన్ని ప్రత్యేకతలున్న అనకాపల్లి జిల్లా పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనపపరచాలని కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

Related posts

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

మందుబాబుల‌కు గుడ్ న్యూస్

Sub Editor 2

అన్ని శాఖల సమన్వయంతోనే గృహ నిర్మాణాలలో పురోగతి

Satyam NEWS

Leave a Comment