39.2 C
Hyderabad
April 28, 2024 14: 50 PM
Slider కరీంనగర్

ఈటల రాజేందర్‌కు కేంద్ర బలగాల సెక్యూరిటీనా..!

#Etala Rajender

ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు.. రెండు రోజుల్లో ఆయనకు భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ ఎంపీ రఘు రామకృష్ణరాజుకు ముప్పు ఉందని వై కేటగిరి భద్రత పెంచారు. ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ కు ఈ స్థాయి భద్రత పెంచడం మాత్రం అనూహ్య పరిణామమే అవుతుంది.

కేంద్ర భద్రత ఇస్తారన్న సమాచారం బయటకు రాకముందు ఈటల సతీమణి జమున ప్రెస్ మీట్ పెట్టారు. తన భర్తను చంపడానికి కౌశిక్ రెడ్డి రూ.20 కోట్ల సుపారీ ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో ఆయన చెప్పారన్నారు. అయితే కౌశిక్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తాను ఈటలను హత్య చేయించడానికి ప్లాన్ చేయలేదని.. హత్యారాజకీయాలు చేసేది ఈటలేనని మండిపడ్డారు. తర్వాత ఈటల కూడా ప్రెస్ మీట్ పెట్టి.. నయీంకే భయపడలేద.. ఈ సైకోకు భయపడతానా అని కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు.

ఆ తర్వాత కేంద్ర భద్రత ఇస్తారన్న సమాచారం బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సొంత పార్టీ నాయకులైనప్పటికీ.. ఊరకనే భద్రత కల్పించదు. అది ఆషామషీ వ్యవహారం కూడా కాదు. బలమైన ముప్పు ఉంటేనే భద్రత కల్పిస్తుంది. దీంతో నిజంగానే ఈటల విషయంలో ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా.. అన్న అనుమానాల్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts

నిరాశ నిస్పృహ‌ లలో కొట్టుమిట్టాడుతున్న సీఎం కేసీఆర్

Satyam NEWS

కరెంటు కోతతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నరకయాతన

Satyam NEWS

గెలుపుకోసం కష్టపడి పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment