27 C
Hyderabad
May 10, 2024 04: 09 AM
Slider మహబూబ్ నగర్

లిజన్ కేర్ ఫుల్లీ: సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి

girijan

నాగర్ కర్నూలు జిల్లాలో ఫారెస్ట్ భూములు సాగుచేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం ధర్మా నాయక్ కోరారు. ఈ విధంగా 12 వేల ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వాలని ఆయన అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో గాయత్రి జూనియర్ కళాశాలలో తెలంగాణ గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అశోక్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ధర్మా నాయక్ మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం 2006 వచ్చి దాదాపుగా 14 సంవత్సరాలు కావస్తున్నా నాగర్ కర్నూలు జిల్లాలో సాగుచేస్తున్న వేలాది మంది గిరిజనులకు అటవీ  భూములకు పట్టాలు ఇవ్వడం లేదని అన్నారు. ఫారెస్టు అధికారులు గిరిజనులను హరితహారం పేరుతో  వేధిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ గిరిజనులను భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కొల్లాపూర్ నియోజక వర్గం లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న గిరిజనులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా గిరిజనులకు అన్యాయం చేశారని అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ ప్రాంతంలో గిరిజనులకు, దళితులు బహుజనులకు ఇచ్చిన లావణి పట్టా ను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో ఉంచిందని, ఆన్లైన్లో లావణీ పట్టాలు వచ్చేటట్టుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

కొత్త పాస్ బుక్కులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం 10 శాతం రిజర్వేషన్, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, భూమిలేని పేదలకు 3 ఎకరాల భూమి వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.  ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శంకర్ నాయక్, నాయకులు లక్ష్మణ్ నాయక్, మండల అధ్యక్ష కార్యదర్శులు దశరథం నాయక్ అశోక్ నాయక్, శంకర్, రమేష్, రవి, శివ ,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైస్ మిల్లు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి

Satyam NEWS

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీవీ చానల్‌ పేరుతో మోసం

Satyam NEWS

Leave a Comment