30.7 C
Hyderabad
May 5, 2024 05: 27 AM
Slider మహబూబ్ నగర్

బహిరంగ చర్చకు అనుమతి ఇవ్వండి.. అడిషనల్ ఎస్పీకి వినతి

#jupally

దరఖాస్తు అందజేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు

తెలంగాణ ఉద్యమ నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై జూపల్లి స్పందించారు. ఈ నెల 26 న కొల్లాపూర్ పట్టణంలోనీ అంబేడ్కర్ చౌరస్తా లో బహిరంగ చర్చకు రావాలని తెలంగాణ ఉద్యమ నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి కి సవాల్ విసిరారు.

దీనికి సంబంధించిన అనుమతి కోసం నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీనీ మంగళవారం జూపల్లి అనుచరులు కలిశారు. ఈ మేరకు బహిరంగ చర్చకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి కోరుతూ  జిల్లా కేంద్రంలోనీ అడిషనల్ సుపరిండెంట్ ఆఫ్ పోలీస్ కు దరఖాస్తు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పస్పుల నరసింహ, యన్మన్ బెట్ల మాజీ సర్పంచ్ మేకల నాగరాజు,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎక్బల్, మున్సిపల్ కౌన్సిలర్ నయీం, జూపల్లి యువసేన నాయకులు కల్వరాల నరసింహ పాల్గొన్నారు.

Related posts

సీట్లు మార్చినా నీకు ఓట్లే రావు జగన్

Satyam NEWS

ప్రలోభాలు, బెదిరింపుల వల్లే కడప జిల్లాలో ఏకగ్రీవాలు

Satyam NEWS

విగ్రహాల విధ్వంసం నెపంతో రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టిస్తున్నారు

Satyam NEWS

Leave a Comment