36.2 C
Hyderabad
May 8, 2024 19: 04 PM
Slider విజయనగరం

ట్రాఫిక్ సిబ్బంది సేవలు అమోఘమంటూ సర్టిఫికెట్ ఇచ్చిన పోలీస్ బాస్

#vijayanagarampolice

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఆ జిల్లా ఎస్పీ దీపిక, జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పోలీసు స్టేషన్లులో నమోదైన తీవ్రమైన, సాధారణ కేసుల్లో దర్యాప్తు జాప్యానికి గల కారణాలను జిల్లా ఎస్పీ సమీక్షించారు.

దర్యాప్తును వేగవంతం చేయాలని, దర్యాప్తు పూర్తి చేయుటకు అవసరమై కీలక పత్రాలను సంబంధిత విభాగాల నుండి త్వరిగతిన పొంది, సకాలంలో సంబంధిత కోర్టుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. నేరాలను నియంత్రించేందుకు రాత్రి, పగలు పెట్రోలింగును, గస్తీని పెంచాలన్నారు. రాత్రి గస్తీ సమయంలో హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులను తనిఖీ చేయాలని, అనుమానస్పద వ్యక్తుల వేలిముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో చెక్ చేసి, వారి నేర చరితను పరిశీలించాలన్నారు.

విజిబుల్ పోలీసింగును, గ్రామ సందర్శనలను ఎక్కువగా నిర్వహించి, గ్రామాల్లో ఎటువంటి తగాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టాలని, మైనర్లు, లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిపై ఎం.వి. కేసులు నమోదు చేసి, కౌన్సిలింగు చేయాలన్నారు. జూదం ఆడే వారిపై నమోదు చేస్తున్న కేసుల్లో నిర్వాహకులను గుర్తించి, వారిపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు.

ఈ నెల 26న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, అందుకు ప్రత్యేక కార్యాచరణను సంబంధిత పోలీసు అధికారులు రూపొందించుకోవాలన్నారు. ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోగల నాటుసారా తయారీ, అమ్మకాలు చేస్తున్నట్లుగా ఇప్పటికే గుర్తించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిఘా ఏర్పాటు చేయాలని, నాటుసారా నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

బెల్లం ఊటలు ధ్వంసం కేసుల్లో విచారణ చేపట్టి, బెల్లం ఊట నిల్వలకు కారకులైన వారిని గుర్తించాలని, అదే విధంగా నాటుసారా తయారీకి నల్ల బెల్లాన్ని విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి, కేసుల్లో నిందితులుగా చేర్చి, వారిపై చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు.

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

మే మాసాంతరంకు గాను (1) ఎస్.కోట పిఎస్ పరిధిలో 4 చోరీ కేసులను ఛేదించి, నిందితులను అరెస్టు చేసి, వారి నుండి 3.80 లక్షల విలువైన పోయిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడంతోపాటు, మద్యం అక్రమ రవాణ, విక్రయదారులపై 4 కేసులునమోదు చేసి, 7గురిని అరెస్టు చేసినందుకుగాను ఎస్.కోట ఎస్ఐ జె. తారకేశ్వర రావు ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకుగాను “బెస్ట్ పెర్ఫార్మర్ మెమోంటో”ను

(2) ఒక చోరీ కేసును ఛేదించి, .1.05 లక్షల విలువ గల చోరీ ఆస్తిని రికవరి చేసి, దిశ అవగాహనా సదస్సులు నిర్వహించి, అత్యధిక సంఖ్యలో దిశ యాప్రి జిస్ట్రేషన్ మరియు రహదారి భద్రతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకుగాను చీపురుపల్లి ఎస్ఐ ఎ.సన్యాసి నాయుడు కు (3) నాటుసారా అక్రమ రవాణదారులపై అత్యధిక కేసులు నమోదు చేసిన కొత్తవలస ఇన్స్పెక్టర్ ఎస్.బాల సూర్యారావు కు

(4) దర్యాప్తులో ఉన్న కేసుల్లో 5 కేసులను త్వరితగతిన పూర్తి చేసి, మద్యం అక్రమ రవాణదారులపై, ఎన్ఫోర్సుమెంటు కేసులను అత్యధికంగా నమోదు చేసినందుకుగాను బుదరాయవలస ఎస్ఐ, సి.హెచ్.నవీన్ పడాల్ కు (5) పెండింగులో ఉన్న 16 కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయడంతోపాటు, పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి, 16మందిని అదుపులోకి తీసుకున్నందుకుగాను నెల్లిమర్ల ఎస్ఐ పి.నారాయణ రావు ను

(6) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, 17 కేసులను చేధించినందుకుగాను భోగాపురం ఎస్ఐ, యు. మహేశ్, కానిస్టేబుళ్ళు (7) ఎస్.సాయిశంకర్, (8) పి. నాగరాజు లను, (9) రాష్ట్ర మంత్రులు బస్సు యాత్ర చేపట్టి విజయనగరం పట్టణంకు వచ్చినపుడు ట్రాఫిక్ ను సమర్ధవంతంగా క్రమబద్ధీకరించినందుకు గాను విజయనగరం ట్రాఫిక్ ఎస్ఐ, ఎల్.దామోదర్ ను (10) ఏఎస్పై కె.నూకరాజు లను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ రావు, ఎస్.ఈ.బి. అదనపు ఎస్ఐ కుమారి ఎన్.శ్రీదేవీ రావు, విజయనగరం ఇన్ ఛార్జ్ డిఎస్పీ టి.త్రినాథ్, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాస రావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, సీఐలు బి.వెంకటరావు, జి.రాంబాబు, రుద్ర శేఖర్, జే.మురళి, సిహేచ్. లక్ష్మణ రావు, టి.ఎస్.మంగవేణి, ఎస్.కాంతారావు, విజయనాధ్, ఎస్.బాల సూర్యారావు, జి.సంజీవరావు, ఎం.నాగేశ్వర రావు, శోభన్ బాబు, పి.శ్రీనివాస రావు, నర్సింహ మూర్తి, పలువురు ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరోనా మృతుడి అంత్యక్రియలు చేసిన hmtv రిపోర్టర్

Satyam NEWS

పొత్తులకు సిద్ధం: చంద్రబాబు కీలక ప్రకటన

Satyam NEWS

ఏప్రిల్ 18న శ్రీ భాష్యకారుల సాత్తుమొర‌

Satyam NEWS

Leave a Comment