38.2 C
Hyderabad
May 3, 2024 21: 31 PM
Slider గుంటూరు

అధికారులను చూసి పరారైన బంగారు వ్యాపారులు

#goldshops

తునికల శాఖ రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు బంగారు షాపుల పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని ఉన్నత అధికారుల ఆదేశాలతో మాచర్ల, కారంపూడిలో బంగారం షాపులను తనిఖీ చేసినట్లు తునికల కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ జిల్లా అధికారి ఎన్. అల్లురయ్య తెలిపారు. అయన కారంపూడిలో మీడియాతో మాట్లాడుతూ కారంపూడిలో అనేక బంగారు షాపులు ఉన్నాయని హుటహుటిన రెండు షాపులు జయసాయి జ్యువలరీ మార్ట్, వాసవి జ్యువలరీ మార్ట్ తనిఖీ చేసి వారి పై కేసు నమోదు చేయటం జరిగిందని అయన తెలిపారు.

మీ వాహనాలను చూసి బంగారు షాపు వ్యాపారులు తలుపులు మూసి వెళ్లిపోయారు కదా అని అధికారిని మీడియా ప్రశ్నించగా మళ్ళీ వస్తాం మళ్ళీ దాడులు చేస్తాం అంటూ సమాధానం ఇచ్చారు. ఇది ఇలా ఉండగా గోల్డ్ మార్చేంట్స్ అసోసియేషన్ నాయకులు తునికల కొలతల శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపడం జరిగింది. వాస్తవంగా రెండు వాహనాలలో జిల్లా అధికారులతో పాటు నరసరావుపేట, సత్తెనపల్లి తదితర ఇన్స్పెక్టర్లు అధికారి వెంట యంత్రాంగం తనిఖీలో పాల్గొనటం జరిగింది.

బంగారు షాపులలో తునికలలో త్యాడా లేకపొతే కారంపూడి బంగారు వ్యాపారులు ఎందుకు షాపులు మూసివేసారో అర్థంకానీ ప్రశ్నగా మిగిలింది. ఏది ఏమైనా తునికల అధికారులు రావటంతో షాపులు మూసి షాపు యజమానులు పరారు అయ్యారంటే కచ్చితంగా తూకంలో మోసం జరిగి ఉంటుందని ఈ నేపథ్యంలోనే షాపులు ముసివేశారని కారంపూడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఒక మండల కేంద్రంలో ముఖ్యంగా కారంపూడిలో ఉన్నన్ని షాపులు వేరే మండలాలలో ఎక్కడ కూడా లేవని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related posts

మెదక్ అడిషనల్ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడి

Satyam NEWS

పాదయాత్రలో ఇచ్చిన హామీ గుర్తు లేదా ముఖ్యమంత్రి గారూ?

Satyam NEWS

రష్యా వ్యాక్సిన్ నూటికి నూరు శాతం సేఫ్

Satyam NEWS

Leave a Comment