40.2 C
Hyderabad
May 5, 2024 15: 04 PM
Slider విజయనగరం

ఇయర్ ఎండ్ లో గుడ్ న్యూస్ చెప్పిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

#suryakumariias

కొత్త ఏడాది శుభ సందర్భంలో విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శుభవార్త చెప్పారు. భోగాపురం ఏర్ పోర్ట్,గిరిజన యూనివర్సిటీ పనులు ముందు కెళుతున్నాయని…ఎలాంటి అవరోధాలు, అవాంతరాలు ఇక లేవని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి చెప్పారు. ఇక  జిల్లాలో చేపట్టిన చిట్టిగురువులు కార్యక్రమం ద్వారా శత శాతం అక్షరాస్యత సాదించడం, సఖి బృందాలను ఏర్పాటు చేసి యువతులలో ధైర్యాన్ని నింపి వారికీ భరోసా నివ్వడం సంతృప్తిని కలిగించాయని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు.  

కౌమార బాలికల విద్య, ఆరోగ్యం, ఆర్ధిక స్వావలంబన సాధించే దిశగా 3,272 బృందాలను 89 వేల మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జిల్లాకే ప్రత్యేకమని అభిప్రాయం వ్యక్తం చేసారు.  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో ఏడాది లో సాధించిన విజయాలను, ప్రాజెక్టుల పురోగతి పై వివరించారు. చిట్టి గురువులు కార్యక్రమం ద్వారా 8370 మంది నిరక్షరాశ్యులను నమోదు చేయాగా 8004 మంది 95.6 శాతం పరీక్ష లో పాస్ అయ్యారని తెలిపారు. 

70 శాతం స్కూళ్ల అభివృద్ధి

జిల్లాలో నాడు నేడు కార్యక్రమం క్రింద మొదటి దశ లో 849 , రెండవ దశ లో 739 పాఠశాలలను, 17కళాశాలలను  అభివృద్ధి చేయడానికి పనులు చేపట్టగా  70 శాతం  వరకు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలిపారు. జమ్మునారాయణపురం పాఠశాల జాతీయ స్థాయి లో స్వచ్చ విద్యాలయ పురష్కారాన్ని సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. కే.జి.బి.వి. ఫలితాల్లో  కూడా మొదటి స్థానం లో నిలిచామని, బై జూస్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతోందన్నారు.

ఉపాధి హామీ పధకం లో జిల్లాలో అత్యధిక పనులను చేపట్టి 304.3 కోట్ల రూపాయలను ఖర్చు చేసి రాష్ట్రం లోనే ప్రధమ స్థానాన్ని సాధించిందని తెలిపారు. అదే విధంగా అత్యధిక వేతనాలను చెల్లించిన జిల్లాగా నిలిచిందని, 1.4 కోట్ల పని దినాలను కల్పించి రెండవ స్థానం లో నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో 4 లక్షల 61 వేల  మంది వేతన దారులు ఉండగా 2 లక్షల 77 వేల మంది మహిళలు పని చేస్తూ రాష్ట్రం లో అత్యధిక మహిళలు పనిచేస్తున్న రెండవ జిల్లాగా కూడా గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. 

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని అన్నారు.  ప్రత్యేకంగా మహిళా పారిశ్రామిక వేత్తల కోసం రెల్లి లో 158 ఎకరాలను కేటాయించడం  జరిగిందని పేర్కొన్నారు. 10 కోట్ల తో మెడికల్ డయాగ్నొస్టిక్స్, మరో 10 కోట్ల తో రెండు రైస్ మిల్లులను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు.  ఎం.ఎస్.ఎం.ఈ క్రింద మాంగో జెల్లీ, బెల్లం శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ, ప్లేస్ మెంట్ క్రింద 2500 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని, మరో 3500 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతోందని వివరించారు.

ఈ ఏడాది లో భోగాపురం ఎయిర్పోర్ట్, మెడికల్ కళాశాల, జాతీయ రహదారుల పనులు పురోగతి సాధించాయని, ట్రైబల్ యూనివర్సిటీ, భోగాపురం శంకుస్థాపనలు త్వరలో జరుగుతాయని తెలిపారు.  అందుకు సంబంధించిన  భూ సేకరణ పూర్తి అయ్యిందని, మెడికల్ కాలేజీ లో వచ్చే జూన్ కి అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు.  అతి పెద్ద లే అవుట్  గుంకలాం లో 10 వేల మందికి మంజూరు చేసిన గృహా నిర్మాణాలు  వేగంగా  జరుగుతున్నాయని, త్వరలో గృహ ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు.

పించన్ల ఎంపికకు 6 స్టెప్ పద్ధతి :

జిల్లాలో కొత్తగా 10 వేల మందికి పించన్లను మంజూరు చేయడం జరిగిందని,  తెలిపారు.  6 స్టెప్ వెరిఫికేషన్ లో అనర్హులుగా గుర్తించిన 4800 మందికి నోటీసు లు జరీ చేయడం జరిగిందని,  అందులో విచారణ అనంతరం  50 శాతం వరకు అర్హత సాధించిన వారు ఉన్నారని, వారికీ పించన్ అందజేయడం  జరుగుతుందని తెలిపారు. మిగిలిన వారిలో కొందరు ప్రూఫ్ లను సమర్పించడానికి సమయం కావాలని అడుగుతున్నారని, వారికీ కొంత సమయం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పించన్ పై ఎలాంటి ఆందోళన వద్దని, నిజమైన, అర్హత ఉన్న వారందరికీ పించన్ అందుతుందని స్పష్టం చేసారు.

జిల్లా ప్రజలంతా పండగలను కోవిడ్ దృష్టి లో పెట్టుకొని జరుపుకోవాలని, 2023లో   ప్రజలందరికీ మంచి జరగాలని,ఆరోగ్యంగా ఉండాలని,  జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని ఆశిస్తున్నానని, ప్రజలందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలను  తెలిపారు.

Related posts

ఏపిలో హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర

Satyam NEWS

టిఆర్ ఎస్ పార్టీ నేత సంతు ఆకస్మిక మృతి

Satyam NEWS

ప్రజాగళం వినిపించే కుండబద్దలు సుబ్బారావు మృతి బాధాకరం

Bhavani

Leave a Comment