31.7 C
Hyderabad
May 2, 2024 08: 26 AM
Slider గుంటూరు

ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి వేటు వై నాట్ 175 స్లోగన్

#Potula Balakotayya

రాబోవు ఎన్నికలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే సభల్లో చెబుతున్న వై నాట్ 175 స్లోగన్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి వేటు అని,అర్థం పర్థం లేనిదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభివర్ణించారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వై నాట్ 175 ? అంటున్న ముఖ్యమంత్రి 175 ఎందుకు ఇవ్వాలో ?, ఏం చేశారని 175 అడుగుతున్నారో ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

శాసనసభలో రాజధానికి మద్దతు పలికి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకా? గల్లా పట్టుకుని ప్రత్యేక హోదా చేస్తానని, తేకుండా ఊరకున్నందుకా?విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ సాధించకుండా మిన్నకున్నందుకా? పోలవరం పూర్తి చేయకుండా ఎండ బెట్టి నందుకా? ఎందుకు 175 ఇవ్వాలో చెప్పాలన్నారు.

రాజధాని కొరకు 34, 348 ఎకరాలు ఇచ్చిన 28,881 మంది రైతులను రోడ్లపాలు చేసినందుకా? ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు చేసినందుకా? డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం,చీరాల కిరణ్ బాబు వంటి వారి ఉసురు పోసుకున్నందుకా? చెప్పాలన్నారు.దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న 27 రకాల సంక్షేమ పథకాలను నిలిపివేసినందుకా? ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించినందుకా? తెలపాలన్నారు.

151అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇస్తే ఏం చేశారో ముందుగా చెప్పి, 175 ఎందుకు ఇవ్వాలో తెలపాలన్నారు. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లినందుకా? ఒక్కో రైతు కుటుంబంపై 2లక్షల 42 వేల అప్పు తలభారంగా వేసినందుకా? న్యాయస్థానాల తీర్పులను హేళన చేసినందుకా? ప్రతిపక్షాలపై దాడులు, హత్యలు చేసినందుకా?

వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా పరిపాలన చేయాలనుకునే తలంపే ప్రజాస్వామ్య మనుగడకు,రాజ్యాంగ స్పూర్తికి గొడ్డలి పెట్టు కాదా? అని ప్రశ్నించారు. పరిపాలనా లోపాలతో కొట్టుమిట్టాడుతున్న ముఖ్యమంత్రి కి ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా అర్థం కావటం లేదని, వైసీపీ ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టి పరమానందయ్య శిష్యులతో పోటీ పడుతున్నట్లుగా ఉందని బాలకోటయ్య చమత్కరించారు.

Related posts

అక్రమంగా ఆయుధాల స్మగ్లింగ్‌.. కబడ్డీ క్రీడాకారుడు అరెస్ట్‌

Sub Editor

ఈ దేశానికి ఏమైంది? ఆందోళనకర పరిస్థితుల్లో ఐదుగురు సీఎంలు

Satyam NEWS

ఈనెల 28న కరీంనగర్ కు అమిత్ షా రాక

Satyam NEWS

Leave a Comment