27.7 C
Hyderabad
May 4, 2024 09: 15 AM
Slider విజయనగరం

రాజ్యాంగ, ప్రజా, కార్మిక, ఉద్యోగ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

#AITUC

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం ఇచ్చిన ఏఐటీయూసీ

కేంద్రంలో, రాష్ట్రంలో పాలన వెలగబెడుతున్న ప్రభుత్వాలు భారత రాజ్యాంగ విలువలను, ప్రజా, కార్మిక, ఉద్యోగ హక్కులను కాల‌రాస్తున్నాయంటూ ఏఐటీయూసీ  ధ్వ‌జ‌మెత్తింది.ప్ర‌బుత్వ విధానాల‌ను తుంగలోకితొక్కి ప్రభుత్వాలకి, కార్పొరేట్లకి అనుకూలంగా  మార్పులు చేయడం నియంత పాలనకు నిదర్శనమని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ విమర్శించారు.

73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా విజయనగరం బాలాజీ కూడలిలో వ‌ద్ద .అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం బుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నేత జగనన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను, కార్మికులను పర్మినెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, కనీస వేతనం 24 వేలు ఇస్తామని చెప్పి పి ఆర్ సి లో మున్సిపల్ పర్మినెంటు, కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు.

మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల అందర్నీ పర్మినెంట్ చేస్తామని నమ్మించి మోసం చేశార‌ని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న జీవో నెంబర్ 1615 ప్రకారం కరువు భత్యం, మధ్యంతర భృతి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు కుటుంబంలో ఒకరికి ఉపాధి అనే ప్రస్తావన పీఆర్సీలో లేకపోవడం దారుణమన్నారు.

151 జీఓ ప్రకారం 24 వేలు జీతాలు పెంచుతామని చెప్పి మున్సిపల్ డ్రైవర్లకి కంటితుడుపుగా కేవలం 18500 మాత్రమే పెంచడమేంటని ప్రశ్నించారు. విజయనగరం కార్పోరేషన్ అయిన తరువాత పట్టణ విస్తీర్ణం పెరుగుతున్నది అందుకనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచకపోవడం వలన ప్రస్తుతం పనులు చేస్తున్న కార్మికులపై పని భారం తీవ్రంగా పెరుగుతుందన్నారు.

రిటైర్మెంటైన, మృతిచెందిన‌ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని…. జూన్, జూలై హెల్త్ అలవెన్సులు ఇంతవరకు చెల్లించలేద‌ని ఆరోపించారు.. ఈ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయకపోతే ఏఐటీయూసీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారి పోరాటానికి సిద్ధం కాబోతున్నామని గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబెడ్కర్ గారి విగ్రహం సాక్షిగా ప్రతినిభూనుతున్నామని బుగత అశోక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు, జిల్లా కార్యదర్శి టి.జీవన్, జిల్లా ఉపాధ్యక్షుడు జలగడుగుల కామేష్, విశాలాంధ్ర బుక్ హౌస్ జిల్లా ఇన్ఛార్జ్ సయ్యద్ ఇబ్రహీం, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు తుపాకులు శ్రీను,  బండి రాము, బొగ్గు శంకర్, ఎమ్.ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంచి కంటి చూపు కోసం  20-20-20 నియమం పాటించాలి

Satyam NEWS

తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు అందరికి అందాలి

Satyam NEWS

చేనేత వస్త్రాలపై 5% జి‌ఎస్‌టి బాధాకరం

Murali Krishna

Leave a Comment