40.2 C
Hyderabad
May 1, 2024 16: 27 PM
Slider ఖమ్మం

దేశాన్ని అమ్మే పనిలో మోడీ ప్రభుత్వం

#Modi government

మూడోవ సారి కూడా తిరిగి ఒకవేళ మోడీ అధికారంలోకి వస్తే దేశాన్ని తూకంలో పెట్టి మరీ బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మడం ఖాయమని సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు ఆరోపించారు. బైపాస్ రోడ్డు కూరగాయల మార్కెట్ వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టిన ఘనత మోడీ కే దక్కుతుంది అని విమర్శించారు.

దోచుకోవడం, దాచుకోవడం పని మీద మాత్రమే మోడీ అనుచరులు వున్నారు అని ఆరోపించారు. మోడీ కి బినామీ గా అదానీ వున్నారని, అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయడానికి మోడీ నిరాకరణ చేశాడని ఆరోపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహిలు అని ముద్ర వేయడం మోడీ ప్రభుత్వానికి ప్యాషన్ అయిపోయింది అని విమర్శించారు.

దేశంలో మత కల్లోలాలు అమాంతంగా పెరగటానికి కారణం మోడీ విధానాలే కారణం అని దుయ్యబట్టారు. రైల్వే, విమానాశ్రయాలు, రక్షణా రంగం, బొగ్గు గనులు, పోర్ట్ లు తదితర బంగారం లాంటి ప్రభుత్వ సంస్థలను మోడీ బినామీ అదానీ కు ఉచితంగా ధారాదత్తం చేసే పనిలో మోడీ ప్రభుత్వం వుంది అని విమర్శించారు.

రానున్న ఎన్నికల్లో బిజెపి ను గెలిపిస్తే దేశ ప్రజలు మరిన్ని కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వై విక్రమ్, భుక్యా శ్రీను, బోడపట్ల సుదర్శన్, కంపాటి వెంకన్న, బీరప్ప, నర్రా రమేష్, డి వీరబాబు, ఉపేంద్ర నాయక్, ఫకీరు సాహిబ్, జె.వెంకన్న బాబు, ఫకీరు సాహిబ్, యాటా రాజేష్, గుమ్మడి బిక్షం తదితరులు పాల్గొన్నారు

Related posts

భార్య కుటుంబాన్ని ఏకే 47 తో కాల్చేసిన కానిస్టేబుల్

Satyam NEWS

సిఎం పేరు చెప్పి మోసాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు

Satyam NEWS

కార్పొరేటర్ శ్రీదేవిని ఘనంగా సత్కరించిన డివిజన్ నాయకులు

Bhavani

Leave a Comment