39.2 C
Hyderabad
May 3, 2024 12: 21 PM
Slider మహబూబ్ నగర్

మాల నాగరాజును హత్యచేసిన దుండగులను ఉరితీయాలి

#malamahanadu

తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

మే 4న హైదరాబాదులోని సరూర్ నగర్ లో ప్రజలందరూ చూస్తుండగా అతి కిరాతకంగా మాల నాగరాజును హత్య చేయడాన్ని నిరసిస్తూ మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ కులాల పేరుతో మతాల పేరుతో దళితులను హత్య చేయడం దారుణమన్నారు. ఇటువంటి హత్యలను ముక్తకంఠంతో  ఒక్కరు ఖండించాలి అన్నారు.ఇటువంటి సంఘటనలు గతంలో అగ్రవర్ణాలకు చెందిన ఆడపిల్లలను చేసుకున్నప్పుడు కూడా హత్య చేశారని అప్పుడు లేవని నోరు ఇప్పుడు మతతత్వ పార్టీ అయినా భాజపా మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

కనీసం రక్షణ చట్టాలను చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన లేదా అని ప్రశ్నించారు. కులాంతర మతాంతర వివాహాలు చేసుకొనే మాల లను టార్గెట్ చేస్తూ చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ దళితులను సమానంగా చూడకపోవడం ఏంటని మండిపడ్డారు.

కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణగా చట్టాలను చేసినప్పుడే ఇటువంటి హత్యలు జరగవని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో సరైన అవగాహన కల్పించి కుల రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడాలన్నారు. బాధిత కుటుంబానికి తెలంగాణ మాల మహానాడు అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. 

చట్టపరంగా అందాల్సిన అన్నింటినీ వెంటనే బాధిత కుటుంబానికి అందించాలని అంతేకాకుండా 50 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పునరావృతం కాకుండా దోషులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనుపోతుల కర్ణ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు,  మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు మనోజ్ కుమార్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువత ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేశవ్,జిల్లా కార్యదర్శి కాడం రాఘవేందర్, జిల్లా సహాయ కార్యదర్శి బ్యాగరి వెంకటేష్,  విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అజిత్ కుమార్, నియోజకవర్గం అధ్యక్షులు తోళ్ళ మాసయ్య, పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్,మహబూబ్ నగర్ మండల గౌరవ అధ్యక్షులు కాడం కథలయ్య, హన్వాడ మండల అధ్యక్షులు ధర్పల్లి బాలకృష్ణయ్య, గండీడ్ మండల అధ్యక్షులు వెంకటయ్య,పత్తి మునయ్య, మంత్రి యాదయ్య, శ్రీశైలం, అర్జున్,కాడం శ్రీనివాస్, మంత్రి నవీన్ కుమార్, క్యాతూర్ శ్రీనివాస్, గాదే అభిలాష్,మరియు శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహారాష్ట్రలో రేపే బలపరీక్షకు సుప్రీం ఆదేశం

Satyam NEWS

హెంగార్డు నిజాయితీ…20వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ అప్పగింత…!

Satyam NEWS

కొత్త సీసీ రోడ్డు,కాల్వ‌లను ప్రారంభించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment