Slider విజయనగరం

క‌రోనా వ్యాక్సినేష‌న్ ను ప్రారంభించిన జిల్లా క‌లెక్ట‌ర్….!

#VijayanagaramCollector

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని క‌లెక్ట‌ర్ డా.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ప్రారంభించారు. నగరంలోని పి ఎస్ ఆర్ కాలనీ .. 34వ సచివాలయం లో   కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని  క‌లెక్ట‌ర్  ప్రారంభించారు. అనంత‌రం…స‌చివాల‌యంలో జ‌రుగుతన్న క‌రోనా వ్యాక్సినేష‌న్ ను జిల్లా క‌లెక్ట‌ర్…డీఎంహెచ్ఓ ర‌మ‌ణ‌కుమారీతో పాటు ప‌రిశీలించారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా విజ‌య‌న‌గ‌రం నగరపాలక ప‌రిధి పీఎస్ఆన్ 34 వ వార్డు సచివాల‌యంలో..మున్సిప‌ల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, రాజీవ్ కాలనీ పిహెచ్ సి డాక్టర్ సిహెచ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇక నగరంలోని బాబామెట్ట ప్రాంతంలో  6వ నెంబర్ సచివాలయం లో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు… జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్. .ఈ కార్య‌క్ర‌మంలో ,వార్డు కార్పొరేటర్ గాదం మురళితో పాటు వార్డు మెంబ‌ర్లు..స‌చివాల‌య సిబ్బంది, స్థానిక ప్ర‌జ‌ల‌కు పాల్గొన్నారు.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న క‌ట్ట‌డికి జిల్లా యంత్రాంగం విస్త్ర‌త చ‌ర్య‌లు…!

ఒక‌వైపు క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటేనే, మ‌రోవైపు వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌న‌గ‌రం జిల్లా శాఖ   ముమ్మ‌రం చేసింది. జిల్లా వ్యాప్తంగా  ప్ర‌యోగాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తో  పాటు బొబ్బిలి, సాలూరు, పార్వ‌తీపురం ప‌ట్ట‌ణాల్లోని  స‌చివాల‌యాన్ని ఎంపిక చేశారు. ఆయా ప్ర‌దేశాల‌లో‌ ప్ర‌తీ సోమ‌, బుధ‌,గురు, శ‌ని వారాల్లో ఉద‌యం 9 నుంచి సాయంత్రం 5 గంట‌లు వ‌ర‌కూ వేక్సిన్ వేయించుకోవ‌చ్చు.అలాగే మంగ‌ళ‌, శుక్ర‌, ఆదివారాల్లో వేక్సినేష‌న్  వేయ‌రు. ప్ర‌స్తుతం  వ‌చ్చిన ఫ‌లితాల‌ను బ‌ట్టి, త‌రువాత ద‌శ‌లో వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని గ్రామ స‌చివాల‌యాల‌కు విస్త‌రించ‌నున్నారు. 45 ఏళ్లు పైబ‌డిన వారంతా  త‌మ ఆధార్ కార్డును, ఫోన్ నెంబ‌రును ఎంపిక చేసిన‌ స‌చివాల‌యానికి తీసుకువెళ్లి వేక్సిన్ వేయించుకోవ‌చ్చు. క‌నీసం 28 రోజుల గ‌డువు త‌రువాత మ‌రో డోసు వేక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌తీ స‌చివాల‌యానికి ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించ‌డంతోపాటు, ఒక  పీహెచ్సీ ని కూడా అనుసంధానం చేసిన‌ట్లు జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి తెలిపారు.

Related posts

గ్రేట్ సర్వీస్:గర్భిణీ స్త్రీనిఆసుపత్రిలో చేర్పించిన సీఆర్ఫీఎఫ్

Satyam NEWS

కర్నూలు ఎస్పీగా కృష్ణకాంత్ పదవీ స్వీకారం

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

Sub Editor 2

Leave a Comment