27.7 C
Hyderabad
May 14, 2024 04: 33 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ కు ఇచ్చిన వరాలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

#roshapati

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఈనెల 6న,రానున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు ని స్వాగతిస్తూ హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల సందర్భంగా వరాల జల్లులు కురిపించారని,అవి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలం చెందారని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి ఆరోపించారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గ్రంథాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో రోషపతి మాట్లాడుతూ టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ కి మారడంతో ఆంధ్రప్రదేశ్ లో బి ఆర్ ఎస్ శాఖ ఏర్పాటు చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని,ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులకు 21,000 ఇప్పటికే నెలకు జీతం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇస్తుందని,తెలంగాణలో 15,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, కెసిఆర్ ప్రభుత్వం దీనిలో ఏది ఆదర్శంగా గొప్పగా తీసుకోవాలో కెటిఆర్ చెప్పాలని అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా విఆర్ఏ లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే గతంలో కెసిఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని, సమ్మె చేస్తున్న విఆర్ఎ లని కెటిఆర్ రెండు మార్లు చర్చలకు పిలిచి ఉపఎన్నికల అనంతరం ఒక నెలలోనే వారి సమస్యలు పరిష్కరించి అమలు చేస్తానని హామీ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమింపజేసి విఆర్ఏ లని మోసం చేశారని ఆరోపించారు.వీరే గాక రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం రాగానే అందరిని పర్మిట్ చేస్తా అన్నారని, కానీ ఇంతవరకు అమలు ఎందుకు చేయలేదని,అమలు చేయకపోగా కనీస వేతనం 27,000 రూపాయలు  ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడి,ఆశ,మధ్యాహ్న భోజనం స్కీము కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని కోరారు.

హుజూర్ నగర్ పట్టణంలో ఉప ఎన్నిక అనంతరం కృతజ్ఞతా సభ పెట్టిన సిఎం కెసిఆర్ హుజూర్ నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు,నేరేడుచర్ల మున్సిపల్ కి 15 కోట్ల రూపాయలు,రామస్వామి గుట్ట వద్ద డబల్ బెడ్ రూమ్ బకాయి అమౌంట్ ఇచ్చి రిపేర్ చేసి అర్హులైన వారందరికీ డబల్ బెడ్ రూమ్ లు ఇస్తామన్నారు, కానీ పంచుడేమో దేవుడు కెరుక హుజూర్ నగర్ పట్టణంలో గత 25,30 సంవత్సరాల నుంచి కాలువ కట్టన,రోడ్ల పక్కన జీవిస్తున్న వివిధ వర్గాల కార్మికులు 250 కుటుంబాలు వీధిన పడ్డారని,ఇది జగమెరిగిన సత్యం అని అన్నారు.

తక్షణమే హుజూర్ నగర్ పట్టణంలో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని,అర్హులైన ప్రజలకి,కార్మికులకు, ఉద్యోగులకు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పంచాలని,ముందుగా కాలువ కట్ట మీద వేసుకున్న ఇండ్లని తొలగించిన వారికి ఇండ్లు ఇచ్చి వారికి జరిగిన నష్టపరిహారం ఇవ్వాలని,స్కీమ్ వర్కర్లు,కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని,అప్పటి వరకు కనీస వేతనం 27,000 రూపాయలు నెలకి  ఇవ్వాలని శీతల రోషపతి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య,కార్యదర్శులు కస్తాల ముత్తమ్మ,కస్తాల సైదులు,రవి,కుమారి, లక్ష్మీకాంతం, చంద్రకళ, పద్మ, రాంబాయి, పుల్లయ్య,గోపి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్ 

Related posts

MMOF ట్రైలర్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

ఉన్మాదుల నుంచి మహిళలను రక్షించే చట్టాలు రావాలి

Satyam NEWS

దివ్యాంగుల ప్రధాన డిమాండ్ పై కలెక్టర్ కరుణించే నా !

Bhavani

Leave a Comment