26.7 C
Hyderabad
April 27, 2024 09: 46 AM
Slider నల్గొండ

ఉన్మాదుల నుంచి మహిళలను రక్షించే చట్టాలు రావాలి

#WomenProtest

దేశంలో మహిళలపై అత్యాచారాలకు అంతం లేకుండా పోయిందని NFIW జిల్లా కార్యదర్శి దేవరం మల్లీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ‘భారత జాతీయ మహిళా సమాఖ్య’ జాతీయ సమితి పిలుపు మేరకు శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ అత్యాచార ఆగడాలకు అంతం ఎప్పుడు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మృగోన్మాదుల నుండి బాలికలకు,మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనీషా కేసును సిబిఐ చేత విచారణ జరిపించాలని, కేసును తప్పుదారి పట్టించటానికి ప్రయత్నిస్తే వారు ఎంతటి వారైనా వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, చట్టాలను కఠినతరం చేయాలని అన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు పశ్యా పిచ్చమ్మ, యల్లాల ఉమా, దేవరం సుజాత, సోమగాని లక్ష్మి, చెన్నగాని శ్రవంతి, సిహెచ్.రామనర్సమ్మ, చెన్నగాని లక్ష్మి, పులిచింతల లక్ష్మి, ఆశ, రజిత, వెంకటమ్మ, సక్కుబాయి, మంగమ్మ, రామ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

Satyam NEWS

బెయిల్ నిబంధనలను జగన్ అతిక్రమిస్తున్నారు

Satyam NEWS

రెండవ విడత పల్లె ప్రగతిపై అవగాహన సమావేశం

Satyam NEWS

Leave a Comment