29.2 C
Hyderabad
October 13, 2024 16: 06 PM
Slider ఆంధ్రప్రదేశ్

బంపర్ ఆఫర్: ఆక్రమిత భూముల రెగ్యులరైజేషన్?

jagan cabi

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా డికెటి పట్టా భూములను రెగ్యులరైజ్ చేయాలనే నిర్ణయం తో బాటు ఆక్రమిత భూములను కూడా రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లోని చాలా పట్టణాలలో ఎన్నో కాలనీలు మరీ ముఖ్యంగా పట్టణ శివారులలో ఉన్నాయి. ఇవన్నీ ఆక్రమిత భూములే. ఈ కాలనీలలో ఎక్కువ భాగం ఎస్సీ కాలనీలే ఉన్నాయి. ఎంతో కాలంగా నివాసం ఉంటున్నా కూడా ప్రభుత్వం నుంచి తమకు పట్టాలు రావడం లేదని ఈ కాలనీల వాసులు చాలా కాలంగా అంటున్నారు.

కరెంటు బిల్లు నీటి బిల్లు కడుతున్న కాలనీ వాసులు చాలా మంది ఉన్నారు. అయినా వారికి ఆ భూమిపై ఇంత  కాలం హక్కు లేదు. ఇప్పుడు అలాంటి కాలనీ లను గుర్తించి వారికి మార్కెట్ రేటుకు వారు నివాసం ఉంటున్న భూమిని ఇచ్చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వేలాది ఎకరాలలో ఇలాంటి కాలనీలు ఉన్నందున మార్కెట్ రేటు ప్రకారం భూమిని అనుభవిస్తున్నవారికే రెగ్యులరైజ్ చేస్తే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో వారికి భూమి దక్కినట్లు అవుతుంది. ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుంది.

Related posts

కొల్లాపూర్ ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Satyam NEWS

ఆమె ఎస్పీనే కాదు…క‌రోనా వుమెన్ వారియ‌ర్..!

Satyam NEWS

తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment