32.2 C
Hyderabad
May 8, 2024 13: 21 PM
Slider విజయనగరం

2 అడుగుల స్థ‌ల వివాదంలో పోలీసు పంచాయితీ

#VijayanagaramPolice

పోలీస్ స్టేష‌న్ అంటే ఓ దేవాల‌యం..పోలీస్ స్టేష‌న్ అంటే మ‌న ఇల్లు..అనే భావ‌న అంద‌రిలో క‌లిగేలా ప్ర‌జ‌ల కోసం పోలీసులు..అన్నభావ‌న క‌లిగించే విధంగా ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ‌…చ‌ర్య‌లు తీసుకుంటోంది…చేప‌డుతోంది.

అందులో భాగంగానే డ‌య‌ల్ 100కు వ‌చ్చిన ఫోన్ కాల్ ఆధారంగా..స‌మ‌స్య‌ను తెలుసుకుని…ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో గంట స్థంబం వ‌ద్ద ఉన్న వ‌న్ టౌన్ పోలీసులు.అదీ ఎస్పీ రాజ‌కుమారీ, విజ‌య‌న‌గ‌ర డీఎస్పీ అనిల్ ఆదేశాల‌తో ఈ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు…స్టేష‌న్ సిబ్బంది.

పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చిన లేదా డ‌య‌ల్100 కు ఫోన్ చేసిన బాధితుల‌కు చట్ట ప‌రంగా న్యాయం చేయ‌డ‌మే త‌మ క‌ర్త‌వ్య‌మ‌ని..చెప్ప‌డం కాదు..చేసి చూపిస్తున్నారు…విజ‌య‌నగ‌రం జిల్లా పోలీసులు.

అదీ జిల్లా కేంద్రంలో అతి ముఖ్య‌మైన అతి ఎక్కువ కేసులు వ‌స్తున్న‌  న‌గ‌రానికి గుండెకాయ వంటిది అయిన‌ వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ సిబ్బంది.

గ‌తేడాది స్టేష‌న్ కు వ‌చ్చిన స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్, ముర‌ళీ….తన స్టేష‌న్ ఎస్ఐలు కిర‌ణ్ కుమార్,దేవీల‌తో వ‌న్ టౌన్ స్టేష‌న్ ప‌రిధిలో వ‌స్తున్న‌, న‌మోద‌వుతున్న కేసుల‌లో బాధితుల‌కు చ‌ట్ట‌ప‌రంగా న్యాయం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌ట్ట‌డ‌మేకాక‌..ఆ విధంగా దృష్టి పెడుతున్నారు.

న‌గ‌రంలోని ప‌ద్మావ‌తి న‌గ‌ర్ కు చెందిన  ఇద్దరు మ‌హిళ‌లకు చెందిన స్థ‌ల వివాదంలో  చాలా చాక‌చ‌క్యంగా సీఐ ముర‌ళీ వ్య‌వ‌హ‌రించారు.

ఆ ఇద్ద‌రు మ‌హిళల్లో ఒక‌రు డ‌య‌ల్100 కు ఫిర్యాదు చేయ‌డంతో కంట్రోల్ రూమ్ ద్వారా పిర్యాదు అందుకున్న వ‌న్ టౌన్  స్టేస‌న్  సీఐ ముర‌ళీ…..ఆ బాధతురాలిని స్టేష‌న్ కు  ర‌మ్మ‌న‌డ‌మే కాకుండా…ఆమె ఇచ్చిన  ఫిర్యాదుతో మిగిలిన ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను స్టేష‌న్ కు పిలిపించారు.

కేసు నమోదు చేయ‌కుండానే..ఇరువ‌రు అభిప్రాయాలు తెలుసుకున్న‌..సీఐ ముర‌ళీ..ఆ స‌మ‌యంలో మీడియా రావ‌డంతో మరోసారి ఇరు పార్టీల ఆరోప‌ణ‌లు విని తెలుసుకున్నారు.

ప‌ద్మావ‌తీ న‌గ‌ర్ లో ఇరువురి కు చెందిన స్థ‌ల వివాదంలో ఎవ‌రి డాక్యుమెంట్ల ఉన్న‌ప్ప‌టికీ…రెండు అడుగుల స్థ‌లాన్ని ఆక్ర‌మించుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌ను ఆధారంగా తీసుకున్న సీఐ ముర‌ళీ…ఇరు పార్టీల‌ను  వారికున్న డాక్యుమెంట్స్ ను తీసుకుని..త‌హ‌శీల్దార్ వ‌ద్ద‌కు వెళ్లి..అవ‌స‌ర‌మైనేత  ల్యాండ్ సర్వేయ‌ర్ చే కొల‌త‌లు తీయించుకోవాల‌ని సూచించారు.

 డీ.ప‌ట్టాలు,  భూముల విష‌యంలో పోలీసులు క‌ల్పించుకోర‌ని…ఈ సంద‌ర్భంగా స్టేష‌న్ లో రెండు పార్టీలు కు తెలియ చేసారు. ఏదైనా ప్ర‌జ‌లతో పోలీసులు అన్న విధంగా న‌గ‌ర వ‌న్ టౌన్ పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే చెప్పాలి.

Related posts

హమ్మయ్య, సీఎం కేసీఆర్ మళ్లీ వచ్చిండు

Satyam NEWS

మచ్చలేని మహానేత గిరిప్రసాద్

Bhavani

పేదరికం నుండి బయట పడాలంటే చదువు ఒక్కటే మార్గం

Satyam NEWS

Leave a Comment