24.2 C
Hyderabad
December 10, 2024 00: 06 AM
Slider తెలంగాణ

ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం నేరుగా చర్చలు జరపాలి

kodanda

త్రిసభ్య కమిటీ ఈడీ కమిటీలు కాకుండా ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం నేరుగా చర్చలు జరపాలని తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రలోని ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు,యూనియన్లే  కారణమని, యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని ప్రభుత్వం చెప్తోందని తెలిపారు. ఒకప్పుడు ఉద్యమ సమయంలో ఈ యూనియన్ నాయకులే సమ్మెలో ప్రత్యేక పాత్ర పోషించిన విషయాన్ని ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోవద్దని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి ఆదాయం 8 నుంచి 900 కోట్లు ఆదాయం వస్తోందని, బస్సు పాస్ రాయితీ ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి 500 కోట్లు వస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి ఆర్టీసీ కడుతున్న దానికంటే ప్రభుత్వం నుంచి వచ్చేది చాలా తక్కువని చెప్పారు. ఇలాంటప్పుడు ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం ఎలా అవుతారని ప్రశ్నించారు. కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కార్మిక శాఖలో ఉన్న అధికారికి సంప్రదింపుల కోసం  బాధ్యత అప్పగించారని అన్నారు. తర్వాత  అతనిని ట్రాన్స్ ఫర్ చేశారని తెలిపారు. ముగ్గురు అధికారులతో ఏం జరిగిందో తెలుసుకొమ్మని మాత్రమే కమిటీ వేశారు తప్ప చర్చలు చేయుమని కాదని అన్నారు. కోర్ట్ చర్చలు చేపట్టి సమస్య పరిష్కరించాలని సూచించినా ప్రభుత్వం మళ్ళీ ఈడీ కమిటీ వేసిందన్నారు. ఇది సరికాదని పేర్కొన్నారు. ఈ కమిటీల ద్వారా సమస్య పరిష్కారం కాదని, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. ఆర్టిసి నష్టాలలో ఉంది. జీతాలు ఇవ్వలేమని కోర్టుకు గట్టిగా చెప్పాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్తున్నారన్నారు. ఇలాంటి వాటిని ఆక్షేపించాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts

కొత్త అప్పులు పుట్టని పాత అప్పుల ఊబి ఆంధ్రప్రదేశ్

Satyam NEWS

జనసేన పార్టీలో చేరిన నిర్మాత కాయగూరల లక్ష్మీపతి

Satyam NEWS

కరోనా కారణంగా ఇద్దరు జర్నలిస్టుల మృతి

Satyam NEWS

Leave a Comment