22.2 C
Hyderabad
December 10, 2024 11: 28 AM
Slider తెలంగాణ

పోలీసులను ఏమార్చి రేవంత్ రెడ్డి తరహాలో…

kodanda toll plaza

రేవంత్ రెడ్డి తరహాలోనే కోదండరామ్ నేడు పోలీసులకు చుక్కలు చూపించారు. ఛలో ప్రగతి భవన్ సందర్భంగా విస్త్రతమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులను తప్పించుకుని తన ఇంటి నుంచి బుల్లెట్ పై వచ్చి ప్రగతి భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధర్నా చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ధర్నాను నిలువరించలేకపోయినందుకు ఒక ఏసీపీ స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం కూడా తెలిసిందే. అదే తరహాలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా నేడు పోలీసుల కళ్లు కప్పి వారికి బురిడీ కొట్టించారు. ఒకవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ కామారెడ్డి పర్యటన పోలీసులకు చుక్కలు చూపించింది. ఆయన రాక కోసం భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు గంటల తరబడి వేచి చూస్తూ వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరికి పోలీసుల కళ్ళుగప్పి ఆర్టీసీ కార్మికుల టెంట్ వద్ద ప్రత్యక్షం అయ్యారు. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుసుకున్న కోదండరామ్ ఇతర దారి గుండా నేరుగా కార్మికుల టెంట్ వద్దకు చేరుకున్నారు. టోల్ ప్లాజా వద్ద గంటల తరబడి వేచి ఉన్న తమను దాటుకుని కోదండరామ్ ఎలా వచ్చారో పోలీసులకు అర్ధం కాలేదు. చివరకు టెంట్ వద్ద పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రలోని ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు సూచించిందని అన్నారు. కార్మికులకు మంచి స్థితిగతులు, వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు  తెలిపిందని అన్నారు. కార్మికుల డిమాండ్లలో చాలా వరకు ఆర్థిక భారం లేనివి ఉన్నాయని కోర్టు సూచించిందని వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆర్టీసీ సమ్మె విషయంలో గంటల తరబడి సమీక్షలు జరిపారని, సమ్మె పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉన్నా ఈడీ కమిటీని వేయడం ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు. కమిటీల ద్వారా కాకుండా చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Related posts

చదువులతో బాటు యువత క్రీడల్లో రాణించాలి

Satyam NEWS

ఉద్యోగ సంఘాలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది

Satyam NEWS

వై ఎస్ కుటుంబంలో సఖ్యత కోసం మోడీ పెద్దరికం?

Satyam NEWS

Leave a Comment