42.2 C
Hyderabad
May 3, 2024 16: 08 PM
Slider ముఖ్యంశాలు

షుగర్ వ్యాధి గ్రస్తులకు పారితోషికం ఇవ్వాలి

#WanaparthyCollector

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ పరంగా పారితోషికం ఇవ్వాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధం వెంకటేశ్వర్లు వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాకు వినతిపత్రం అందజేశారు.

 తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 70 లక్షల మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని వారికి వయసుతో సంబంధం లేకుండా నెలకు రెండు వేల రూపాయలు పారితోషికం అందిస్తే ఆరోగ్యపరమైన సమస్యలు మితిమీరకుండా ఉండడానికి ప్రభుత్వం పరోక్షంగా సహకరించినట్లు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విషయాన్ని  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కి వినతి పత్రం అందజేస్తున్న ట్లు స్వీకరించాల్సిందిగా చెప్పగా వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష సానుకూలంగా స్పందించారు. అంతకంటే ముందు వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష కి బోకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ ఖాజమైనద్దిన్, కొత్తకోట ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు శ్రీధర్ శెట్టి, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు

Satyam NEWS

శ్రీగురూజీ స్వదేశీ ఆగమనం సందర్భంగా…!

Satyam NEWS

అమ్మనాన్న వృద్దాశ్రమంలో దుస్తులు, పండ్లు ఇచ్చిన విద్యార్థులు

Satyam NEWS

Leave a Comment