37.2 C
Hyderabad
May 2, 2024 13: 08 PM
Slider నెల్లూరు

అమ్మనాన్న వృద్దాశ్రమంలో దుస్తులు, పండ్లు ఇచ్చిన విద్యార్థులు

#venkatagiri

నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు స్థానిక రాణిపేటలోని అమ్మ నాన్న వృద్ధుల అనాధ ఆశ్రమంలోని వృద్ధులకు దుస్తులు, పండ్లు, బిస్కట్ ప్యాకెట్లు అందచేశారు. నారాయణ స్కూల్ విద్యార్ధులు అమ్మనాన్న వృద్ధాశ్రమంలోని వృద్ధుల సహాయార్ధం ప్రతి ఏటా స్వచ్చందంగా బట్టలు, పండ్లు,బిస్కట్ ప్యాకెట్లు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా నారాయణ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు  వృద్దుల కోసం వారికి తోచిన సహాయంగా స్కూల్ యాజమాన్యం ప్రోత్సాహంతో, వారి తల్లిదండ్రుల సహకారంతో బట్టలు,పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు అందజేశారు. విద్యార్థులకు చిన్నతనం నుండే వృద్దులకు సహాయం చేయాలనే ఆలోచన రావడం అభినందనీయమని ఆశ్రమ చైర్మన్ కె.రమాకాంత్ అన్నారు. వెంకటగిరి నారాయణ స్కూల్ AGM గురువయ్య, ప్రిన్సిపాల్ వి.కిరణ్,AO మల్లికార్జున్ కు ఆశ్రమ నిర్వాహకులు కె.రమాకాంత్, కె.వేదసంహిత కృతజ్ఞతలు తెలిపారు.

వెంకటగిరి సామాన్యుడు

Related posts

కొల్లాపూర్ పోలీస్ ల వ్యవహారశైలిపై..మాజీ మంత్రి సీరియస్

Satyam NEWS

కి “లేడీ” ల‌ను ప‌ట్టుకున్న లేడీ పోలీస్….!

Satyam NEWS

అన్న‌దాత‌ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment