27.7 C
Hyderabad
May 4, 2024 09: 51 AM
Slider హైదరాబాద్

కుర్చికి వినతిపత్రం ఇచ్చిన విద్యార్థి, యువజన సమితి నేతలు

#amberpet

జూన్ 13 న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 16 రోజులు గడుస్తున్నా ఉచిత పుస్తకాలు, ఉచిత డ్రెస్సులు అందించలేదు. దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్బారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 40% పుస్తకాలకే ప్రభుత్వం ప్రింటింగ్ కి ఆర్డర్ ఇచ్చారని సమాచారం.

ఇదే నిజమయితే ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బడుల విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందే అవకాశం లేదు. పుస్తకాలను, డ్రెస్సులను వెంటనే అందించాలని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ.. ఈరోజు తెలంగాణ  స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనకి వినతిపత్రం ఇవ్వడానికి విద్యార్థి, యువజన సమితి నాయకులు వెళ్లారు.

దాదాపు మూడు గంటల వరకు వేచి చూసిన, అపాయింట్ ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీంతో విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు బాబూ మహాజన్, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీంపాష, విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్ తదితరులు కుర్చీకి వినతిపత్రం ఇచ్చి వచ్చారు.

ఇకనైనా ప్రభుత్వ బడులలోని సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.

సత్యం న్యూస్, అంబర్ పేట్

Related posts

మిగులు యూనిట్లు  వెంటనే గ్రౌండింగ్ కావాలి

Murali Krishna

నిరాధారమైన వార్తలు రాసినందుకు విలేకరి అరెస్టు

Satyam NEWS

పోలీసులకు ప్రత్యేక మినరల్ వాటర్ సరఫరా

Satyam NEWS

Leave a Comment