33.7 C
Hyderabad
April 28, 2024 23: 23 PM
Slider నల్గొండ

కోదాడ పట్టణంలో పట్టుబడ్డ చైన్ స్నాచింగ్  దొంగలు

#kodadapolice

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ పట్టణ ఎస్ఐ నాగభూషణం ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్ రోడ్ లో బుధవారం ఉదయం ఐదు గంటలకు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఖమ్మం జిల్లాకు చెందిన తేలూరు వెంకటేష్, వృత్తి ఆటో డ్రైవర్ ఎన్టీఆర్ కృష్ణ జిల్లాకు చెందిన ఆలూరి నవీన్ కుమార్ వృత్తి స్టూడెంట్ అనుమానాస్పదంగా కనిపించారు.

బైక్పై వెళ్తుండగా వారిని ఆపి బైకు కాగితాలు చూపమని కోరగా అనుమానాస్పదంగా మాట్లాడుతూ తప్పించుకు పారిపోతుండగా వెంటనే స్పందించిన పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు.

గత సంవత్సర కాలంగా ఖమ్మం కోదాడ పరిధిలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతూ ఉన్నారని తెలియజేశారు. వీరు వద్ద నుండి 13 తులాల బంగారం ఒక పల్సర్ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ మీడియా సమావేశంలో తెలియజేశారు.

అనంతరం దొంగలను పట్టుకోవడంలో చకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పి డీ. వెంకటేశ్వర్ రెడ్డి, కోదాడ పట్టణ సీఐ. ఏ నరసింహారావు, ఎస్సై ఎం నాగభూషణం, రూరల్ ఎస్సై రాంబాబు, ఏఎస్ఐ మల్లేష్, పోలీస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Related posts

హాం ఫట్: ఆర్ధిక సంక్షోభానికి త్రిశూల్ పూజ

Satyam NEWS

అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లో 100 ఇళ్లు నిర్మించుకున్న చైనా

Sub Editor

మంత్రి పువ్వాడ‌కు క‌రోనా పాజిటీవ్‌!

Sub Editor

Leave a Comment