40.2 C
Hyderabad
May 2, 2024 17: 09 PM
Slider ముఖ్యంశాలు

ఏ బి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు జీవో విడుదల

#ABVenkateswararao

పోలీసు వ్యవస్థ ను ఆధునీకరించే కార్యక్రమం కింద ఇజ్రాయిల్ కు చెందిన ఆర్ టి ఎల్ టి ఏ సిస్టమ్స్, ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్ ఆబ్జక్స్ట్ కంపెనీల నుంచి ఏరోస్టాట్ అండ్ యుఏవి యంత్రాలను కొనుగోలు చేసిన కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడిన కేసుకు సంబంధించి అప్పటి ఇంటెలిజెన్స్ అదనపు డిజిపి ఏబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపక్రమించింది.

ఈ మేరకు ఒక ప్రత్యేక జీవోను విడుదల చేసింది. సంబంధిత యంత్రాల కొనుగోలుకు సంబంధించి తన కుమారుడి కంపెనీకి మేలు చేసే విధంగా ఏ బి వెంకటేశ్వరరావు ప్రవర్తించారనేది ప్రధాన ఆరోపణ.

ఏ బి వెంకటేశ్వరరావు కుమారుడు, ఆకాశం ఎడ్వాన్సుడు సిష్టమ్స్ లిమిటెడ్ సిఇవో ఏ చేతన్ సాయి కృష్ణ కు మేలు కలిగించేందుకు నాసిరకం నిఘా యంత్రాలను కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఏపి ప్రభుత్వం జరిపిన విచారణలో వెల్లడయింది.

ఈ మేరకు సర్వీస్ నిబంధనల ప్రకారం ఏ బి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించి ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల చేశారు.

Related posts

ఖమ్మంలో కాదు చేతనైతే ఢల్లీలో నిరుద్యోగ మార్చ్‌ చెయ్‌

Satyam NEWS

సోదరా నువ్వు భ్రమల్లో బాటుకుతున్నావు

Satyam NEWS

బళ్లారి లో 15న భారీ సభ

Satyam NEWS

Leave a Comment