28.7 C
Hyderabad
May 6, 2024 01: 13 AM
Slider హైదరాబాద్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే కాలేరు సన్మానం

#kaleru

అంబర్ పేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 9 కి పై పాయింట్లు సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన  విద్యార్థులను వారి అధ్యాపకులు, తల్లితండ్రుల సమేతంగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఘనంగా సన్మానించారు. బాలుర ప్రభుత్వ పాఠశాల (లఖోటియా) లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ, అద్భుతమైన ఫలితాలు గవర్నమెంట్ స్కూళ్లల్లోనూ సాధించవచ్చని రుజువు చేసిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు.

ఎంతో కష్టపడి చదివి వీరు  సాధించిన ఈ విజయాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని, రాబోయే రోజుల్లో మరింత మంది ఇంకా మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభకు అండగా నిలిచి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నందుకు ఎమ్మెల్యే అధ్యాపకులకు, ప్రధానోపాధ్యాయులకు మరియు విద్యాశాఖాధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు ఉన్న తరుణంలోనూ, తమ పిల్లలను అక్కడే చదివించి ప్రభుత్వ విద్య పట్ల నమ్మకాన్ని చాటుకున్న తల్లితండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంలో హిమాయత్ నగర్ పాఠశాలకు చెందిన హిందీ టీచర్ శ్రీమతి చాయా దొండాల్కర్ ఆదర్శంగా నిలిచి తన కుమార్తె నేహా కులకర్ణిని అదే పాఠశాలలో చదివించడమే కాకుండా 9.5 సాధించేట్లు కృషి చేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు ఆమెకు అభినందనలు తెలిపారు.

అంబర్ పేట నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 9+ పాయింట్లు సాధించిన విద్యార్థుల పేర్లు:

1. ఎం సుప్రియా

2. జి  తరుణ్

3. ఎం అంజి

4. ఎస్ మీనాక్షీ

5. వి జ్యోత్స్న

6. శాయి అబ్దుల్ ఫహాత్

7. కే  సౌమ్య

8. జి ప్రసన్న కోటేశ్వర రావు

9. సి చరణ్

10. కామతపు చందన

11. బి ఐశ్వర్య

12. నేహా కులకర్ణి

13. జ రూప

14. సిహెచ్ రూపవతి

15. జి అనూష

16. హెచ్ శివ కుమార్

17. మహమ్మద్ అబ్దుల్లా జావీద్

18. ఎం కీర్తన

ఈ కార్యక్రమంలో డిఈఓ విజయ లక్ష్మీ, డెప్యూటీ ఈఓ నిజాముద్దీన్, సంబంధిత అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యులు కే మధు శాలిని, మాధురి, సుకన్య, ఆదిత్య వర్ధ, వెంకట రెడ్డి మరియు పాఠశాల ఉపాధ్యాయులు, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు కే.రామారావు యాదవ్, లింగారావు, రాగుల ప్రవీణ్ పటేల్, రాజగోపాల్ నాయుడు, దయాకర్ యాదవ్, మహేష్ ముదిరాజ్, రఘు బాబు, నాగేష్ ముదిరాజ్, లడ్డు అయ్యాస్ మల్లేష్, అతిక్ మోసిన్, జమీల్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

వడ్డీ వ్యాపారం ముసుగులో సామాన్యులను వేధిస్తే ఉపేక్షించేది లేదు

Satyam NEWS

భారీ నిధులతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం హర్షణీయం

Satyam NEWS

అస్తవ్యస్తంగా మారిన అంగన్ వాడి కేంద్రాలు

Satyam NEWS

Leave a Comment