28.2 C
Hyderabad
May 9, 2024 02: 39 AM
Slider ఖమ్మం

టిఎస్ పిఎస్సి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

#TS PSC exams

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 19వ తేదీన జరుగనున్న డ్రగ్ ఇన్స్ పెక్టర్ అలాగే ఈ 21, 22వ తేదీల్లో జరుగనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) వ్రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ నెల 19వ తేదీన జరగనున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ వ్రాత పరీక్ష ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ పరీక్ష నిర్వహణకు సుజాతనగర్ మండలంలోని అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ సుజాతనగర్ మండలం ఉన్న కళాశాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.

ఈ పరీక్షకు 120 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్స్ సుజాతనగర్, పాల్వంచ మండలంలోని అనుబోసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ పరీక్షలకు 225 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించుటకు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ కేంద్రాలను న మూసివేయించాలని చెప్పారు.

విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. సురక్షిత మంచినీరు అందజేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు తో పాటు తగినన్ని, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసర వైద్య సేవలకు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులు సిద్దంగా ఉంచాలని చెప్పారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు, అలాగే ఇన్విజిలేటర్ విధులు నిర్వహించు సిబ్బంది ఎవ్వరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, క్యాలిక్యూలేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని చెప్పారు. నిశిత పరిశీలన తదుపరి మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు.

విద్యార్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలు తు.చ. తప్పక పాటించాలని ఆయన పేర్కొన్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించరని చెప్పారు.

ఉదయం 9.30 గంటల నుండే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందన్నారు. అలాగే మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుండి అనుమతి స్తారని ఆయన తెలిపారు.

Related posts

రఘునాథపాలెం పోలీస్​ స్టేషన్​ను సందర్శించిన పోలీస్ కమిషనర్

Satyam NEWS

రుచికరమైన పదార్ధాలతో కష్టమర్లను ఆకట్టుకోండి

Satyam NEWS

సెప్టెంబరు 1న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

Satyam NEWS

Leave a Comment