36.2 C
Hyderabad
May 14, 2024 17: 19 PM
Slider వరంగల్

అమరుల స్ఫూర్తితో గీత కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తాం

#gowd

అమరుల యాదిలో భాగంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గట్టమ్మ నుండి జాతీయ రహదారిపై నుండి 150 బైక్ లతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ భవన్ లో కళ్ళు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లుగీత కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు సేఫ్టీ మోకు ఇస్తామని గీతన్న బందు ద్వారా కుటుంబాలను ఆదుకుంటామని గీత కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వంతో చర్చించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.

ఏజెన్సీ లో కల్లు గీత వృత్తి చేస్తున్న గౌడ్ అన్నల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పులి నరసయ్య గౌడ్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో కల్లుగీత కార్మికుల సమస్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని అన్నారు. ప్రధానంగా ఏజెన్సీలో గీత వృత్తి చేస్తున్న కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని అన్నారు. ప్రభుత్వం పాలకులు ఓట్ల రాజకీయం కోసమే చేస్తున్నారని అన్నారు. ఏ వృత్తికి లేని ఆంక్షలు కల్లుగీత వృత్తికి ఎందుకు అని అన్నారు.

సమస్యల పరిష్కారం కోసం అమరుల స్ఫూర్తితో కల్లుగీత కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. గౌడ్ అన్నల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని లేనిచో సెప్టెంబర్ లో లక్షలాది మంది గీత కార్మికులతో ప్రగతి భవన్ ముందు ధర్నా చేస్తామని అన్నారు. గీతన్న భీమా విధివిధానాలు అన్ని సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు 50 సంవత్సరాల నిండిన  కార్మికులకు ఎటువంటి షరతులు లేకుండా ఆసరా పింఛన్ తక్షణమే అందజేయాలని అన్నారు.

తాడి కార్పొరేషన్ నుండి ఇచ్చే పరిహారాన్ని పెంచాలని అన్నారు ఇటీవల తాడిచెట్ల పైనుండి పడి గాయపడిన వికలాంగులైన వారికి ఐదుగురికి తాడి కార్పొరేషన్ నుండి మంజూరైన చెక్కులను ఒకరికి 15 వేల చొప్పున పల్లె రవికుమార్ గౌడ్ గారి చేతుల మీదగా అందించడం జరిగింది అనంతరం బయక్క పేట గ్రామానికి చెందిన ఎరుకలి హేమలత గౌడ్ ఏడు జోన్ల పరిది లో మొదటి స్థానం ఓపెన్ టాప్ లో ఎస్సై సీటు కొట్టినందుకు ఆమెను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర నాయకులు యాదగిరి గౌడ్ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు జనగాం శ్రీనివాస్ గౌడ్ కల్లు గీత సంఘాల ఐక్యవేదికల నాయకుడు కారు పోతుల యాదగిరి గౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ దొమ్మటి సదయ్య గౌడ్ ముస్నపేల్లి మొండయ్యగౌడ్ కల్లుగీత కార్మిక సంఘం సోషల్ మీడియా ఇంచార్జ్ పంజాల ఉదయ్ గౌడ్ .కోరుకోప్పుల శ్రీకాంత్ గౌడ్ కోటగిరి సురేందర్ గౌడ్ బుర్ర వేణు గౌడ్ మాచర్ల ఎలేంద్ర గౌడ్ ఆర్ సదానందం గౌడ్ ఎరుకల గోవిందరాజు గౌడ్ ముఖరాజు గౌడ్ గుండెబోయిన శ్రీహరి గౌడ్ తదితరులు 200 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.

Related posts

భార్యను వేధిస్తున్న డాక్టర్ భర్త అరెస్టు

Satyam NEWS

28న‌ విదేశీ విద్య నిధులు విడుద‌ల చేయాల‌ని ధ‌ర్నా

Sub Editor

ఉద్యమానికి సిద్ధపడుతున్న ఉపాధ్యాయ సంఘం

Satyam NEWS

Leave a Comment