33.7 C
Hyderabad
April 28, 2024 23: 33 PM
Slider కృష్ణ

28న‌ విదేశీ విద్య నిధులు విడుద‌ల చేయాల‌ని ధ‌ర్నా

Ramakrishna

మైనారిటీ సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 28న సోమవారం రాష్ట్ర మైనారిటీ కార్యాలయం ఎదురు ధర్నా, ముట్టడి కార్యక్రమం నిర్వ‌హించ‌నున్న‌ట్లు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ పేర్కొన్నారు. ఫారూఖ్ షిబ్లీ అధ్యక్షతన మైనారిటీ సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలను కలుపుకొని విదేశీ విద్యా పథకం యథాతథంగా కొనసాగించాలని, విదేశాల్లో ఉన్న350మంది విద్యార్థులకు రావలసిన విదేశీ విద్య ఉపకార వేతనాలను తక్షణమే చెల్లించాలని విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విదేశీ విద్యా పథకం అనేది మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరట ఇచ్చే పథకం అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం నందు పాల్గొన్నవిద్యార్థిని తల్లిదండ్రులు యొక్క ఆవేదన నిజంగా కంట తడి పెట్టిస్తుంది అని చెప్పారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ పిల్లలు దేశవిదేశాల్లో అత్యున్నతమైన విద్యను పొందడం ద్వారా మా దేశం అభివృద్ధి పథం వైపు పరుగులు తీస్తుంద‌న్న విష‌యాన్నిముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించాల‌న్నారు. విదేశీ విద్య పథకానికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు 28న రాష్ట్ర మైనారిటీ కార్యాలయాన్నిముట్టడించి దాని ఎదురుగా ధర్నా కార్యక్రమం చేపట్టాలని ఏకాభిప్రాయంతో కార్యచరణ తీసుకున్నారు అని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎండీ ఫతఉల్లా, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అఫ్సర్, IUML రాష్ట్ర కార్యదర్శి ఖాజావలి, జమియాట్ ఉలేమా మౌలానా హుస్సేన్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీం, AISF రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, AISF జాయింట్ సెక్రెటరీ శివారెడ్డి, సిపిఐ జిల్లా అధ్యక్షురాలు అక్కినేని వనజ, AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న70 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

న్యూ లీడర్: పులివెందుల బాధ్యతలు బీటెక్ రవికి

Satyam NEWS

సమ్మె వీడి, విధుల్లో చేరండి..మంత్రి హరీశ్ రావు

Bhavani

శివోహం: కిటకిటలాడిన కీసర శ్రీ రామలింగేశ్వరుడు

Satyam NEWS

Leave a Comment