38.2 C
Hyderabad
May 5, 2024 21: 13 PM
Slider గుంటూరు

తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చిన ఆదర్శనేత ఎన్టీఆర్

#Blod Donation Camp

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25 వ వర్ధంతి గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ డాll చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ డాll చదలవాడ అరవింద బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పార్టీ జెండాను ఎగరవేశారు. ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి డాllచదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ శ్రామికుని చెమట, కరిగిన కండరాలు,  రైతన్నల కష్టార్జితం, రైతు కూలీల రక్తం, కష్టజీవుల కన్నీటిలొ నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.

ఏ కష్టం వచ్చినా కార్యకర్తల పక్షానే ఉంటా

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసేందుకు అందరం కలిసి పనిచేయాలన్నారు.

పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా, నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటాను అన్నారు. నియోజకవర్గంలోని పార్టీ మరింత బలపడుతుందని అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఎన్టీఆర్‌ను తలుచుకోగానే ఓ స్ఫూర్తి వస్తుందని, తెలుగు జాతికి చిరస్మరణీయ వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాలంటే పదవుల కోసం కాదని, సేవా భావంతో పనిచేయాలని ఎన్టీఆర్ అన్నారని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా అందరం పనిచేయాలని డా౹౹చదలవాడ పిలుపునిచ్చారు.

మెగా రక్తదాన శిబిరం

ఎన్టీఆర్ 25వ వర్ధంతి పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అమూల్య నర్సింగ్ హోంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాll చదలవాడ అరవింద బాబు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వందలాది మంది తెలుగు యువత,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. తదనంతరం పల్నాడు రోడ్డు లోని ఏరియా వైద్యశాల ఎదురు, మదర్ తెరిసా హాస్పిటల్ ఎదురు,  పాత చెక్ పోస్ట్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు డాక్టర్ అరవింద బాబు వందలాది మంది కార్యకర్తలతో కలిసి వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అదేవిధంగా ఎన్జీవో కాలనీ,పాత సమితి ఆఫీస్,ఆర్.యు.బి ఎంట్రన్స్, ప్రకాష్ నగర్,షాలేం నగర్,జూపల్లి సెంటర్,బాబాపేట తదితర వార్డులోని ఎన్టీఆర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అదే విధంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వనమా సుబ్బారావు  ఫోటో ను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.

సర్వ మత ప్రార్థనలు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా నరసరావుపేట పట్టణంలో పలుచోట్ల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన చేసిన అనేక రకాల మేలులు,సంక్షేమ పథకాలను గుర్తుచేసి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోనుగుంట్ల కోటేశ్వరరావు,సింహాద్రి యాదవ్, నర్సరావుపేట మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు,రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షులు వెన్న బాలకోటి రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లు బోడపాటి పేరయ్య,మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, పులిమి రామిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొట్ట కిరణ్,

ఇమ్మడిశెట్టి కాశయ్య పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు,టిడిపి నాయకులు వేములపల్లి నరసయ్య,వల్లెపు నాగేశ్వరరావు,అల్లంశెట్టి మోహన్ రావు వాసిరెడ్డి రవి,గొట్టిపాటి జనార్ధన్ బాబు,

రావెల లక్ష్మీనారాయణ,జల్లిపల్లి శేషమ్మ,శాఖమూరి రామ్మూర్తి,మక్కెన ఆంజనేయులు,పులుకురి జగ్గయ్య,ఖాసీం మారుతి,పిచ్చి రెడ్డి,మన్నన్ షరీఫ్,పోక శ్రీను, చంద్రశేఖర్,కోట నాగ సుదీర్, మీరవాలి,యాడ్స్ వాలి,పోతురాజు,పల్లెల గోవింద్ రెడ్డి,పూదోట సునీల్,మనుకొండ జాహ్నవి, బొప్పూడి వెంకాయమ్మ,

అనంతలక్ష్మి,కొర్నేపాటి సంజీవరావు,కోల సంజీవరావు,కళ్యాణం రాంబాబు,వనమా శివ, కందికట్ల కృష్ణ, కోట ప్రసాద్,గడ్డం కరిముల్లా,బొప్పూడి శీను,పెరికల రాయప్ప,మాదిన రసూల్, బడే బాబు,జంగాల వెంకటేశ్వర్లు, కాంతారావు,ఈదర వెంకటేశ్వర్లు,కనుమూరి రమేష్ నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు.

Related posts

యువ హీరో శ్రీ సింహా ‘భాగ్ సాలే’ చిత్రం ‘కూత రాంప్’ పాట విడుదల

Satyam NEWS

ఆకాష్ పూరి-రాహుల్ విజయ్ ముఖ్య అతిధులుగా “నేనెవరు” ఆడియో & ప్రోమో విడుదల

Satyam NEWS

ఆఫ్ఘన్ మహిళలను ఆదరించేందుకు మెక్సికో సిద్ధం

Satyam NEWS

Leave a Comment