42.2 C
Hyderabad
May 3, 2024 15: 59 PM
Slider మహబూబ్ నగర్

ప్రజల ఆకాంక్షను తీర్చని తెలంగాణ సీఎం కేసీఆర్

#BJPWanaparthy

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా ఉద్యమ ఆకాంక్షలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదని బిజెపి రాష్ట్ర నాయకులు వనపర్తి జిల్లా ఇన్చార్జి కడగంటి రమేష్ అన్నారు. నేడు బిజెపి వనపర్తి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు డా.ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న కడగంటి రమేష్ మాట్లాడుతూ అనేక ఆశలు ఆశయాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబ పాలైందని అన్నారు. 2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం సమస్యల సుడిగుండంలో పడిపోయిందని ఆయన అన్నారు.

ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో వరదలు వచ్చి నీళ్లలో మునిగి నెలలపాటు బురదలో ఉంటే సీఎం కానీ మంత్రులు కానీ స్పందించలేదని ఆయన అన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడం ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలకు పిలుపిస్తే పార్టీల నాయకులను ప్రజా సంఘాల నాయకులను రాత్రికి రాత్రే ఇంట్లో వెళ్లి అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమాలకు కేంద్ర బిందువు అయిన ధర్నా చౌక్ ఎత్తి వేసే  ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. బీజేపీ గెలిస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని కేసీఆర్ చెప్పినా దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విద్యావంతులు, విజ్ఞానవంతులు అయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఆయన తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు

రాష్ట్రంలో పూర్తిగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా జహీరాబాద్ నుంచి భద్రాచలం దాకా అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయని KCR కు నిరుద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుందని ఆయన తెలిపారు.

కరోనా మహమ్మారితో రోడ్డున పడ్డ ప్రైవేటు టీచర్లు,ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ లను కనీసం ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మిస్తానని గొప్పలకు పోయిన కేసీఆర్ ఇప్పటి వరకు అందులో పదిశాతం శాతం కూడా కట్టలేదని అన్నారు.

తెలంగాణ ను అప్పుల పాలు చేసిన కేసీఆర్

 తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ వున్న తెలంగాణ నేడు అప్పులపాలు అయిపోయిందని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు పొందని సామాజిక వర్గాలకు విద్య ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పిస్తే తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదని విమర్శించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో స్పష్టమైన ఆదర్శవంతమైన సిద్ధాంతాలతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతో సమర్థవంతమైన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్  నాయకత్వంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఎదుగుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు రావుల రవీంద్రనాథ్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి అయ్య గారి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇంచార్జ్ జింకల కృష్ణయ్య, సీనియర్ నాయకులు భూజల వేంకటేశ్వర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు నారాయణ మాధవ రెడ్డి రామన్ గౌడ్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేతూరి బుడ్డన్న జిల్లా ఉపాధ్యక్షులు బండారు కుమారస్వామి రామన్నగారి వెంకటేశ్వర్రెడ్డి

నరాల నారాయణ సుమిత్రమ్మ,జిల్లా కార్యదర్శులు గౌని హేమా రెడ్డి,పరశురాం, ముప్పురి చెన్నయ్య,పద్మమ్మ,జిల్లా అధికార ప్రతినిధులు గొనెల సహదేవుడు,గోర్ల బాబూరావు,బుచ్చిబాబుగౌడ్, యువమోర్చా అద్యక్షుడు అనుజ్ఞా రెడ్డి,కుమార్,కల్పన,రాఘవేంద్ర గౌడ్,మోహన నాయక్,ఎండీ.కరీం పట్టణ అధ్యక్షులు బోయేళ్ళ రాము,ప్రధాన కార్యదర్శి పెద్దపులి రాము తదితరులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

సామాజిక వ్యవస్థ పై అలుపెరుగని పోరాటం చేసిన భాగ్యరెడ్డి వర్మ

Satyam NEWS

టీకాలు వేయించుకోని విద్యార్ధులను స్కూళ్లలోకి రానివ్వరు

Satyam NEWS

ద్వారకా తిరుమల వైకుంఠాన్ని తలపించాలి

Satyam NEWS

Leave a Comment