40.2 C
Hyderabad
April 26, 2024 12: 42 PM
Slider విజయనగరం

రహదారి భద్రత చర్యలతో మీ ప్రాణాలు ప‌దిలం

#RoadSaftey

ఒక‌రు పోలీస్ అధికారిణి మ‌రోక‌రు ర‌వాణ అధికారిణి. వారే విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ, రోడ్ ట్రాన్స్ పోర్ట్  క‌మీష‌న‌ర్ శ్రీదేవి. ఆ ఇద్ద‌రు మహిళామ‌ణులు సంయుక్తంగా 32న ర‌హదారి భ‌ద్ర‌తా ఉత్స‌వాల‌కు సంబంధించి బ్యాన‌ర్లు,క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌రించారు.

అదీ విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఛాంబ‌ర్ లో.ఈ మేర‌కు ఎస్పీ రాజ‌కుమారీ మాట్లాడుతూ  రహదారి భద్రతా నియమాలు పాటించడంతో వాహనదారుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయన్నారు. ఆ నియమాలు పాటించడక పోవ‌డంతో నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

వాహనదారులు తప్పనిసరిగా భద్రతా నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.ప్రమాదాల్లో మరణాలు జరగకుండా, అందులో  గాయపడిన వారిని గోల్డెన్ హవర్స్ లో |హాస్ప‌ట‌ల్స్ కు  చేర్చి, చికిత్స పొందే విధంగా, వారి ప్రాణాలను నిలిపేందుకు తమవంతు చర్యలు చేపట్టామన్నారు.

ప్రమాదాలు జరిగిన సమయంలో 108 అంబులెన్సు వాహనాలు ఏదైనా కారణాలతో సకాలంలో సంఘటనా స్థలంకు చేరడానికి ఆలస్యం అయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా గాయ‌ప‌డ్డ‌వారిని ఆసుపత్రులకు తరలించాలని పెట్రోలింగు పోలీసులను ఇప్పటికే ఆదేశించామని  ఎస్పీ తెలిపారు.

డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమీషనరు శ్రీదేవి మాట్లాడుతూ ఈ మాసోత్సవాల్లో భాగంగా రహదారి ప్రక్కన ఉన్న ట్రాఫిక్ గుర్తుల పట్ల వాహన దారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండాను రహదారి ప్రక్కన ఏర్పాటు చేసే హెచ్చరిక గుర్తులు, సమాచార గుర్తులు, ఆజ్ఞాపించే గుర్తుల పట్ల వాహనదారులకు కరపత్రాలతో అవగాహన కల్పిస్తామని డిటిసి శ్రీదేవి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రాంకుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ట్రాఫిక్ సీఐ ఎర్రం నాయుడు, ఎస్బీ సిఐలు ఎన్. శ్రీనివాసరావు, జి. రాంబాబు, ఎంవిఐలు బుచ్చిరాజు, జెవిఎస్ఎస్ఎస్ ప్రసాద్, దుర్గా ప్రసాద్ లు పాల్గొన్నారు.

Related posts

పని చేసే సంస్కృతి పెంచుకుందాం రండి

Satyam NEWS

పార్లమెంటు భవన ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరం

Bhavani

పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో మందేసి చిందేసిన ఖాకీ

Satyam NEWS

Leave a Comment