38.2 C
Hyderabad
May 5, 2024 22: 17 PM
Slider విజయనగరం

విజయనగరం ఎస్పీ కి కొత్త ఏడాది శుభాకాంక్షల వెల్లువ

#deepika2

విజయనగరం జిల్లాకు కొత్తగా వచ్చిన లేడి ఎస్పీ దీపికా పోలీసు కార్యాలయంలో  కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కార్యాలయ అధికారులు, పలువురు నగర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు జిల్లా ఎస్పీ  ఎం.దీపిక ని మర్యాద పూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ప్రజలందరికీ కొత్త ఏడాది అందరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా జీవించాలన్నారు. కోరుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది లో పోలీసుశాఖ అన్ని రంగాల్లో రాణించాలని, ప్రజలకు చేరువగా మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ బి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ  పి.సత్యనారాయణ రావు, ఓఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సెంచరీ వీరుడు అవినాష్ గౌడ్ కు అభినందనలు

Satyam NEWS

కేంద్ర మాజీ మంత్రి అశోక్ పై విమర్శలా…ఆ అర్హతే మీకు లేదు…!

Satyam NEWS

ఈ నెల 17, 18న ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం

Bhavani

Leave a Comment