27.7 C
Hyderabad
May 7, 2024 08: 26 AM
Slider జాతీయం

ఫిర్యాదులు లేని ఎన్నికల కౌంటింగ్

#electioncounting

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, ఏడు వేరు వేరు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల ఉప ఎన్నికలలో ఎక్కడా కూడా ఈవీఎంలపై ఫిర్యాదులు రాలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోవైపు పేపర్ ట్రయిల్ మెషిన్ స్లిప్పుల లెక్కింపులో, ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపులో ఎలాంటి తేడా కనిపించలేదని, అవి సరిగ్గా సరిపోలాయని ఎన్నికల కమిషన్ వర్గాలు శుక్రవారం సమాచారం అందించాయి. డిసెంబర్ 8న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఆరు అసెంబ్లీ ఉపఎన్నికలు, ఒక లోక్‌సభ ఉపఎన్నికలో ఓట్ల లెక్కింపు జరిగింది.

ఈ లెక్కింపులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)కి సంబంధించి ఏ స్థాయిలోనూ ఫిర్యాదు అందలేదు. హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్‌లోని మొత్తం 250 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో ఏ రౌండ్‌లో ఫిర్యాదులు లేవని వర్గాలు తెలిపాయి. 1,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించిన ఫలితాలను కూడా అభ్యర్థులు ఆమోదించారు.

ఫలితాలపై పార్టీలు లేదా అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. 500 కంటే తక్కువ ఓట్ల తేడాతో వివిధ పార్టీల అభ్యర్థులు గెలుపొందారని, మళ్లీ కౌంటింగ్‌కు ఎలాంటి డిమాండ్ లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Related posts

భద్రాచలం మాకు అప్పగించి మాట్లాడు కేసీఆర్

Bhavani

ఇన్ పోలీస్ హాండ్స్:చిక్కిన జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్

Satyam NEWS

జగనన్న భవిష్యత్తు కాదు… సామాన్య ప్రజలకు విపత్తు

Satyam NEWS

Leave a Comment